ఏపీ పెన్షన్లలో కీలక మార్పులు- ఈసారి చేతికి ఎంత ? బ్యాంకుల్లో పడేది ఎంత ?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇస్తున్న సామాజిక పెన్షన్ల (NTR Bharosa Pension ) పంపిణీలో ఈసారి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కేంద్రం తెచ్చిన సామాజిక పెన్షన్ల పథకం కారణంగా ప్రతీ నెలా పింఛన్ దారులకు ఇచ్చే నగదులో కొంత మొత్తం ఈసారి నుంచి బ్యాంకు ఖాతాల్లో పడనుంది. దీంతో ఏయే పెన్షన్ దారులకు ఎంత మొత్తం బ్యాంక్ లో పడుతుంది, ఎంత మొత్తం నగదు రూపంలో చెల్లిస్తారన్న వివరాలను ఓసారి తెలుసుకుందాం..

ఏపీ మున్సిపల్ ఎన్నికలపై మరో అప్డేట్- ఆ 20 చోట్ల హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!
ఏపీ మున్సిపల్ ఎన్నికలపై మరో అప్డేట్- ఆ 20 చోట్ల హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

నవంబర్ 1 నుంచి పింఛన్ దారులకు ఇచ్చే మొత్తంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను వేర్వేరు పద్ధతుల్లో లబ్ధిదారులకు అందించనున్నారు. ఇందులో కేంద్ర వాటా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ కానుండగా.. రాష్ట్ర వాటా మాత్రం ఎప్పటిలాగే గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇంటి వద్దే నగదు రూపంలో అందజేస్తారు. ఇందులో కేటగిరీల వారీగా చూసుకుంటే.. వృద్ధులు, ఒంటరి మహిళలకు ఇస్తున్న మొత్తం 4 వేల రూపాయాల్లో ఈసారి నుంచి కేంద్ర వాటా 200 బ్యాంక్ ఖాతాలో పడుతుంది. రాష్ట్ర వాటా 3800 ఇంటివద్ద నగదు రూపంలో అందిస్తారు.

NTR Bharosa Pension Rules Change From November 1 Check Bank Credit and Cash Payment Details
AP Pensions: ఏపీలో పింఛన్ దారులకు మరో అప్డేట్- మళ్లీ మార్పు..!
AP Pensions: ఏపీలో పింఛన్ దారులకు మరో అప్డేట్- మళ్లీ మార్పు..!

అలాగే దివ్యాంగులకు ఇస్తున్న 6 వేల రూపాయల్లో కేంద్ర వాటా 300 బ్యాంకుల్లో పడుతుంది. రాష్ట్ర వాటా 5,700 ఇంటి వద్ద నగదుగా అందిస్తారు. మిగిలిన పెన్షన్లలోనూ కేంద్ర వాటాగా ఇవ్వబోతున్న మొత్తం ఇలా బ్యాంకుల్లో జమ అవుతుంది. రాష్ట్ర వాటా మొత్తం మాత్రం సచివాలయాల ఉద్యోగులు ఇంటికి తెచ్చి నగదుగా ఇస్తారు. అయితే కేంద్ర వాటా మొత్తం జమ కావాలంటే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ తప్పనిసరి అని అధికారులు వెల్లడించారు. ఈ లింక్ లేకపోతే మాత్రం కేంద్ర వాటా జమ కాకపోవచ్చని చెప్తున్నారు. కాబట్టి ఆధార్ లింక్ కావడం, బ్యాంక్ ఖాతాలు యాక్టివ్ గా ఉంటేనే ఈ మొత్తాలు బ్యాంకుల్లో పడతాయి. లేకపోతే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్ధితి ఎదురుకావచ్చని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+