IND vs WI: వైభవ్ ఔట్, సంజుకు లక్కీ ఛాన్స్! తొలి టీ20లో అసలు డ్రామా ఇదే!

IND vs WI: ఐచి-నగోయా 2026 ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి వరుసగా రెండోసారి స్వర్ణ పతకం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు వెస్టిండీస్‌తో పోరుకు సిద్ధమైంది. అక్టోబర్ 6వ తేదీ మంగళవారం లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ జరగనుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం అందించిన శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోనే భారత జట్టు ఈ సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలని చూస్తోంది.

El nino: దేశంలో మళ్లీ కరెంట్ కట్.. 8 రాష్ట్రాలలో విపరీతమైన కోతలు!
El nino: దేశంలో మళ్లీ కరెంట్ కట్.. 8 రాష్ట్రాలలో విపరీతమైన కోతలు!

పుంజుకునేందుకు వెస్టిండీస్ ప్లాన్
ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకున్నప్పటికీ.. మూడో వన్డేలో వెస్టిండీస్ ఘన విజయం సాధించి గట్టి పోటీని ఇచ్చింది. కరేబియన్ జట్టు టీ20 సిరీస్ బలంగా రీ-ఎంట్రీ ఇవ్వాలని పట్టుదలతో ఉంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ బ్యాటింగ్‌లో రాణిస్తుండగా.. శివమ్ దూబే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌కు కొండంత బలాన్ని ఇస్తున్నారు.

India vs West Indies 1st T20I Playing 11 Sanju Samson In Vaibhav Sooryavanshi Out Lucknow Match

ఓపెనింగ్‌లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ.. టాపార్డర్ అంచనా
మొదటి టీ20కి సంబంధించి తుది జట్టులో సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. మూడో స్థానంలో వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మలు మిడిలార్డర్ బాధ్యతలను స్వీకరిస్తారు.

ఆల్‌రౌండర్లు, బౌలింగ్ విభాగం
మిడిలార్డర్లో శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డిలు జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సేవలు అందించనున్నారు. అక్షర్ పటేల్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఆడనుండగా.. కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్‌గా జట్టులో కొనసాగుతాడు. పేస్ బౌలింగ్‌కు అర్ష్‌దీప్ సింగ్ నాయకత్వం వహించనుండగా.. రెండో ఫాస్ట్ బౌలర్‌గా ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రభాస్ 'ఫౌజీ' నుంచి 1 మినిట్ వీడియో లీక్.. ఇంటర్నెట్ షేక్..
ప్రభాస్ 'ఫౌజీ' నుంచి 1 మినిట్ వీడియో లీక్.. ఇంటర్నెట్ షేక్..

వైభవ్ సూర్యవంశీపై కోచ్ గంభీర్ స్పందన
టీమిండియా యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కకపోవడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. వైభవ్ సూర్యవంశీ ఎంతో ప్రతిభావంతుడు, మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ ఆటగాళ్లకు డ్రెస్సింగ్ రూమ్‌లో భద్రతా వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రాధాన్యమని.. అందుకే కొన్నిసార్లు వేచి చూడక తప్పదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించారు.

తొలి టీ20కి భారత తుది జట్టు: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దుబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.

తొలి టీ20కి వెస్టిండీస్ తుది 11 మంది అంచనా: షాయ్ హోప్ (కెప్టెన్/వికెట్ కీపర్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, అకీల్ హొస్సేన్, గుడకేష్ మోతీ, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, క్వెంటిన్ శాంప్సన్, రొమారియో షెపర్డ్, షమార్ స్ప్రింగర్.

భారత పూర్తి జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, నమన్ ధీర్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.

వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, అకేల్ హొస్సేన్, అమీర్ జాంగూ, షమర్ జోసెఫ్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, కమిల్ పూరన్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, క్వెంటిన్ శాంప్సన్, రొమారియో షెపర్డ్, షమార్ స్ప్రింగర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+