సింహరాశి, కన్యా రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఇలా ఏర్పడే యోగాలవల్ల కొన్ని రాశులవారు అదృష్టవంతులవుతారు. 2026 నవంబరు నెలలో సింహ రాశి, కన్యా రాశి వారికి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం.
సింహ రాశి
నవంబరు నెలలో సింహ రాశి వారికి గ్రహాల స్థితిగతుల రీత్యా కొన్ని సవాళ్లు, మరికొన్ని సానుకూల పరిణామాలు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు మరింత ఓపికతో, వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఉద్యోగం, వ్యాపార రంగం
8వ ఇంట్లో శని సంచారం (అష్టమ శని) కారణంగా పనిలో కొద్దిగా ఆలస్యం లేదా ఆశించిన ఫలితాలు నెమ్మదిగా రావడం జరగొచ్చు. అయితే మీరు పెట్టే కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా పెద్ద ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని తెస్తాయి.
ఆర్థిక స్థితి
ఖర్చులు కొంత అదుపు తప్పుకుండా చూసుకోవడం మంచిది. అనవసరమైన లగ్జరీ ఖర్చులకు దూరంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత అవసరం. రాబోయే కాలం కోసం పొదుపు విధానాలపై దృష్టి పెట్టడం ఉత్తమం.
కుటుంబం, సంబంధాలు
మొదటి ఇంట్లో కేతువు, ఏడవ ఇంట్లో రాహువు సంచారం వల్ల జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో చిన్నపాటి మనస్పర్థలు, అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది.
ఆరోగ్యం
ఆరోగ్య పరంగా ఈ నెల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఒత్తిడి కారణంగా అలసట, చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావచ్చు. క్రమమైన వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి మానసిక ప్రశాంతతను ఇస్తాయి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి నవంబరు నెల మధ్యస్థం నుండి మెరుగైన, సానుకూల ఫలితాలను అందించనుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే సమయం ఇది.
ఉద్యోగం, వ్యాపార రంగం
6వ ఇంట్లో రాహువు సంచారం వల్ల పోటీదారులు, శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. కోర్టు కేసులు లేదా ఇతర వివాదాలు ఉంటే మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ పనితీరుకు పైలట్ అధికారుల ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారంలో భాగస్వాముల సహకారంతో మంచి లాభాలు అందుకుంటారు.
ఆర్థిక స్థితి
ఆర్థికంగా ఈ కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. పాత అప్పులు తీర్చాలనే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. అయితే గ్రహాల మార్పులరీత్యా భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడంపై దష్టి పెట్టడం మంచిది.
కుటుంబం, సంబంధాలు
7వ ఇంట్లో శని ప్రభావం కారణంగా వైవాహిక జీవితంలో లేదా బంధువులతో వ్యవహరించేటప్పుడు కాస్త సర్దుబాటు ధోరణి అవసరం. మీ బిజీ షెడ్యూల్ కారణంగా కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. దీనివల్ల చిన్నపాటి అసంతృప్తి రాకుండా మాట్లాడి సర్దుకుపోవడం మంచిది.
ఆరోగ్యం
పాత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. అయినప్పటికీ, విపరీతమైన ఆలోచనల వల్ల నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆహారపు అలవాట్లలో, దినచర్యలో తగిన జాగ్రత్తలు పాటించండి.














Click it and Unblock the Notifications
