ఒక్కసారే 35 మంది లెక్చరర్ల ఉద్యోగాలు ఊస్ట్!

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ రిక్రూట్‌మెంట్ నేపథ్యంలో అభ్యర్థులు ఫేక్ సర్టిఫికేట్లతో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలు మరవకముందే తెలంగాణలో కూడా 35 మంది జూనియర్ లెక్చరర్లు ఫేక్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి అడ్డంగా దొరికిపోయారు. ఫేక్ సర్టిఫికేట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 35 మంది జూనియర్ లెక్చరర్లపై ఇంటర్ విద్యాశాఖ వేటు వేసింది. ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ఆయా జూనియర్ లెక్చరర్లకు వ్యక్తిగతంగా నోటీసులు పంపించింది. వీరంతా కూడా కాంట్రాక్టు లెక్చరర్లుగా నియమితులై రెగ్యులరైజ్ అయిన వారే కావడం గమనార్హం. వారు సమర్పించిన సర్టిఫికేట్లు నకిలీవని తేలడంతో ఇంటర్ బోర్డు ఈ కఠిన చర్యలు తీసుకుంది. సంబంధిత యూనివర్సిటీలు ఆ సర్టిఫికేట్లను తాము జారీ చేయలేదని స్పష్టం చేయడంతో అక్టోబర్ 1న అధికారిగంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

IND vs WI: వైభవ్ ఔట్, సంజుకు లక్కీ ఛాన్స్! తొలి టీ20లో అసలు డ్రామా ఇదే!
IND vs WI: వైభవ్ ఔట్, సంజుకు లక్కీ ఛాన్స్! తొలి టీ20లో అసలు డ్రామా ఇదే!

అసలు ఏం జరిగింది?
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2000 సంవత్సరం నుంచి పలు విడతలుగా కాంట్రాక్టు లెక్చరర్లను నియమించారు. రాష్ట్ర సర్కారు 2023 మే నెలలో వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి జూనియర్ లెక్చరర్లుగా మార్చింది. దాదాపు 3,800 మంది ఈ ప్రయోజనం పొందారు. అధికారులు ఈ ప్రక్రియను హడావిడిగా చేపట్టి సర్టిఫికేట్లను సరిగా పరిశీలించకుండానే నియామక ఉత్తర్వులు అందజేశారు. ఆ తర్వాత నుంచి వారి విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికేట్లను అధికారులు పరిశీలిస్తూనే ఉన్నారు. గతంలోనే ఫేక్ సర్టిఫికేట్లను గుర్తించి దాదాపు 20 మంది ఉద్యోగాల నుంచి తొలగించారు.

Telangana 35 Junior Lecturers Sacked Over Fake Certificates for Regularisation Full Details

2023లో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించారనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో 360 మంది లెక్చరర్ల సర్టిఫికేట్లను సంబంధిత వర్సిటీలకు పంపి వాటి ప్రామాణికతను అధికారులు పునఃపరిశీలించారు. ఇందులో 37 మంది సమర్పించిన పీజీ, బీటెక్ సర్టిఫికేట్లు నకిలీవని తేలడంతో గతంలోనే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఫోర్జరీ, మోసం కేసుల కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. షోకాజ్ నోటీసులు అందుకున్న 37 మంది ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో వారిలో 35 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఇంటర్ బోర్డు డైరెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఉదాహరణకు నిర్మల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి సమర్పించిన సర్టిఫికేట్‌ను యూనివర్సిటీ ఖండించడంతో అతని వివరణను తిరస్కరించి ఉద్యోగం నుంచి తొలగించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. నెలకు సగటున 11 కోట్లకు పైగా ప్రయాణాలు..!
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. నెలకు సగటున 11 కోట్లకు పైగా ప్రయాణాలు..!

వివిధ సబ్జెక్టుల లెక్చరర్లపై ప్రభావం
ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఇంగ్లీష్, గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం(బొటనీ), జంతుశాస్త్రం(జువాలజీ), పౌరశాస్త్రం(సివిక్స్), కామర్స్, హిందీ సబ్జెక్టులను బోధిస్తున్న లెక్చరర్లు ఉన్నారు. వీరంతా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్నారు. కాగా గతంలో కూడా ఫేక్ సర్టిఫికేట్లు గుర్తించి 20 మంది జూనియర్ లెక్చరర్లను తొలగించగా.. రెగ్యులరైజేషన్ ప్రక్రియ సమయంలో మరొక 20 మంది సేవలను ముగించారు. తాజాగా మరో 35 మందిపై వేటు పడటంతో విద్యాశాఖలో కలకలం రేగింది. వీరిలో ఎక్కువగా నల్గొండ, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల వారు ఉన్నారు. చాలా మంది బీహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల్లోని వర్సిటీల నుంచి పీజీ చేసినట్లు సర్టిఫికేట్లు సమర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+