Video: ఇప్పుడే పుట్టిన ఐదు బుజ్జి చీతాల అల్లరి చూడండి.. బోట్స్వానా రక్తంతో సరికొత్త రేస్..

భారతదేశంలో చిరుతల పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతా సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టింది. మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ కునో నేషనల్ పార్క్‌లో మరో తీపి కబురు అందింది. భారత్‌లోనే జన్మించిన 'KJP21' అనే 32 నెలల ఆడ చిరుత తొలిసారిగా ఐదు ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చింది. గతంలో ముఖి, KGP12 అనే ఆడ చిరుతలు ఇక్కడ కూనలకు జన్మనివ్వగా, ఇప్పుడు ఆ వరుసలో నిలిచి మూడో భారతీయ చిరుతగా KJP21 కొత్త రికార్డు సృష్టించింది. ఈ ఐదు చిరుత పిల్లల రాకతో దేశంలో మొత్తం చిరుతల సంఖ్య ఏకంగా 60కి చేరగా, ఇందులో భారత్‌లోనే జన్మించిన చిరుతల సంఖ్య 41కి పెరగడం విశేషం.

New Chapter in Project Cheetah Indian-Born Female Cheetah Delivers 5 Cubs in Kuno National Park
Cheetah: కునోలో కొత్త 'బ్రదర్స్’! మరో నాలుగు చిన్నారి చిరుతల జననం
Cheetah: కునోలో కొత్త 'బ్రదర్స్’! మరో నాలుగు చిన్నారి చిరుతల జననం

బోట్స్వానా రక్తంతో సరికొత్త జన్యు మార్పిడి

ఈ ఐదు చిరుత పిల్లల జననానికి మరో ప్రత్యేకత ఉంది. వీటి తండ్రి బోట్స్వానా దేశానికి చెందిన మగ చిరుత కావడంతో, భారత్‌లో బోట్స్వానా జెనెటిక్ లైనయేజ్ ఇప్పుడే ప్రారంభమైంది. విదేశాల నుంచి తెచ్చిన చిరుతలు భారత వాతావరణానికి అలవాటు పడటమే కాకుండా, ఇక్కడే పుట్టిన చిరుతలు సంతానోత్పత్తి జరుపుతుండటం అటవీ శాఖ అధికారుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పరిణామం రాబోయే తరాల్లో బలమైన, ఆరోగ్యకరమైన చిరుతల సంతతి పెరగడానికి ఎంతో దోహదపడుతుందని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చీతాల రాజ్యంలో సరికొత్త రికార్డు.. స్వేచ్ఛా వనంలోకి మరో రెండు..
చీతాల రాజ్యంలో సరికొత్త రికార్డు.. స్వేచ్ఛా వనంలోకి మరో రెండు..

అభినందనల వెల్లువ.. కేరింతల పండగ

చిరుత కూనల రాకపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ చీతాలో పనిచేస్తున్న అటవీ అధికారులు, వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అహర్నిశలు పడుతున్న శ్రమకే ఈ ఫలితమని వారిని ప్రశంసించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా ఈ పరిణామాన్ని ప్రాజెక్ట్ చీతా సాధించిన మరో చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. భారతదేశ నేలపై పుట్టి పెరిగిన చిరుతలు మళ్లీ ఇక్కడే తమ సంతానాన్ని విస్తరిస్తుండటంతో వన్యప్రాణి ప్రేమికులు పండగ చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+