భారీగా పెరిగిన టికెట్ల ధరలు! తక్షణమే అమల్లోకి కొత్త ధరలు..

దసరా, దీపావళి పండుగల వేళ సొంతూర్లకు, విహారయాత్రలకు వెళ్లాలనుకునే విమాన ప్రయాణికులకు ఇండీగో (IndiGo) సంస్థ ఊహించని షాక్ ఇచ్చింది. పెరిగిన విమాన ఇంధన (ATF) ధరల భారంతో టికెట్లపై ఫ్యూయల్ సర్ఛార్జీని పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడంతో విమాన ఇంధన ధరలు గత పదేళ్లలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. దీని ప్రభావంతో మంగళవారం (అక్టోబర్ 6) అర్ధరాత్రి దాటినప్పటి నుంచి బుక్ చేసుకునే కొత్త టికెట్లపై ఈ అదనపు భారం అమలులోకి వచ్చింది.

IndiGo Hikes Fuel Surcharge Flight Tickets Get Costlier for Domestic and International Travelers
దసరా, దీపావళికి ఊహించని షాక్! ఫ్లైట్ టికెట్ ధరలు ఎంతంటే..
దసరా, దీపావళికి ఊహించని షాక్! ఫ్లైట్ టికెట్ ధరలు ఎంతంటే..

దేశీయ, అంతర్జాతీయ సర్వీసులపై ఛార్జీల బాదుడు

పెరిగిన ఫ్యూయల్ సర్ఛార్జీలతో ప్రయాణ దూరాన్ని బట్టి టికెట్ ధరలు గణనీయంగా పెరగనున్నాయి. డొమెస్టిక్ విమాన సర్వీసులపై రూ. 100 నుంచి రూ. 350 వరకు సర్ఛార్జ్ పెరగనుండగా, 2,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే రూట్లపై ఏకంగా రూ. 1,300 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ విషయానికొస్తే, ఈ పెంపు రూట్ ఆధారంగా గరిష్టంగా రూ. 2,500 వరకు ఉండే అవకాశం ఉంది. ఇండీగో బాటలోనే ఇతర ప్రైవేట్ విమానయాన సంస్థలు కూడా త్వరలోనే సర్ఛార్జీలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

20 ఏళ్ల <strong>పండుగ వేళ 20 వేల ఫ్రీ టికెట్లు.. </strong>
20 ఏళ్ల పండుగ వేళ 20 వేల ఫ్రీ టికెట్లు..

ఇంధన ధరల మంటతో సర్ ఛార్జ్ తప్పలేదన్న సంస్థ

పశ్చిమాసియా సంక్షోభం తర్వాత విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయని, కేవలం గత నెల రోజుల్లోనే ఏకంగా 14 శాతానికి పైగా ధరలు పెరగడం వల్ల సంస్థపై తీవ్ర నిర్వహణ భారం పడిందని ఇండీగో తెలిపింది. గతంలో మూడేళ్ల కాలంలో మూడోసారి సర్ ఛార్జ్ లు పెంచాల్సి రావడం గమనార్హం. ప్రస్తుతం అనివార్యమైన పరిస్థితుల్లోనే ప్రయాణికులపై ఈ భారం మోపాల్సి వచ్చిందని, కొత్తగా బుకింగ్ చేసుకునే ప్రతి ఒక్కరికీ ఈ సవరించిన ధరలు వర్తిస్తాయని సంస్థ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+