అల్లు అర్జున్ 'రాకా' ఫస్ట్ గ్లింప్స్ కు ముహూర్తం ఫిక్స్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. 2024 లో వచ్చిన ఈ యాక్షన్ డ్రామాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. రూ. 400 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 2, 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి దేశంలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల సరసన నిలిచింది. అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా 'రాకా'.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. రాకా మూవీని సన్ పిక్చర్స్ సంస్థ హెడ్ కళానిథి మారన్ దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్, అత్యాధునిక వీఎఫ్‌ ఎక్స్‌ తో రూపొందిస్తున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన అనౌన్స్‌ మెంట్ వీడియోలో చూశాం.

ఇక రాకా మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ట్రైబల్ వారియర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఆయన మూడు విభిన్నమైన గెటప్స్ లో అలరించనున్నారట. అలాగే సైన్స్ ఫిక్షన్, యాక్షన్ డ్రామా కాంబోలా రాకా మూవీ సాగనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మూవీ స్టోరీ రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్ మధ్యలో సాగుతుందని టాక్ వినిపిస్తోంది. వీటిలో ఒకటి పౌరాణిక వేదకాలం కాగా.. మరొకటి ఆధునిక కాలంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాకా మూవీలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తున్నారు. అలాగే రష్మిక మందన్నతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ మూవీలో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాకా సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీతో పాటు మొత్తం ఏడు భాషల్లో గ్రాండ్‌ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Raaka There is talk that the first glimpse of Icon Star AlluArjun movie will be releasedin December

అయితే రాకా మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ లో రాకా మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కానుందని సమాచారం. కానీ దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది సెకండాఫ్ లో రాకా మూవీని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+