ప్రధాని మోడీ బర్త్ డే..! అలా జరుపుకోవాలని కాక్రోచ్ ల షాకింగ్ పిలుపు..!

సెప్టెంబర్ 17న (గురువారం) ప్రధాని మోడీ పుట్టినరోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా అభియాన్ తో పాటు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీతో పాటు ఎన్డీయే పక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ పుట్టినరోజును యువత ఎలా జరుపుకోవాలో సూచిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇవాళ ఓ ట్వీట్ చేసింది. ఇందులో ఎక్కడా ప్రధాని మోడీ పేర్కొనలేదు. అయినా సెప్టెంబర్ 17ను ఎలా జరుపుకోవాలో యువతకు సీజేపీ వివరించింది.

బొద్దింకల వీరవిహారం..! 2 రోజుల్లో 2 ప్రభుత్వాల మెడలు వంచి కీలక నిర్ణయాలు..!
బొద్దింకల వీరవిహారం..! 2 రోజుల్లో 2 ప్రభుత్వాల మెడలు వంచి కీలక నిర్ణయాలు..!

రేపు, అంటే సెప్టెంబర్ 17న, 'నిరుద్యోగ దినం' (Unemployment Day) అని కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ లో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా, తమ తోటి మిత్రులందరికీ ఓ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపింది. మీరందరూ సాయంత్రం వేళ తప్పనిసరిగా ఒక దీపం లేదా కొవ్వొత్తిని వెలిగించాలని కోరింది. అలాగే, ఈ దుర్భర పరిస్థితి నుండి బయటపడి మన కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటామని సంకల్పం తీసుకోవాలని సూచించింది.

CJP Declares PM Modi s Birthday Unemployment Day Urges People to Light Lamps and Take Pledge
సీఎం పోస్టుకు రాజీనామా-గవర్నర్ కు లేఖ..! మోడీకి థ్యాంక్స్ చెప్పిన అభిజీత్ దిప్కే..!
సీఎం పోస్టుకు రాజీనామా-గవర్నర్ కు లేఖ..! మోడీకి థ్యాంక్స్ చెప్పిన అభిజీత్ దిప్కే..!

ఇప్పటికే దేశవ్యాప్తంగా నీట్ అక్రమాలు, స్కూళ్ల దుస్దితిపై వరుస పోరాటాలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ.. ఇప్పుడు దేశంలో మరో అతిపెద్ద సమస్య అయిన నిరుద్యోగంపైనా ఫోకస్ పెడుతోంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో స్కూళ్లలో పర్యటనలు చేస్తూ తనిఖీలు నిర్వహించి, అక్కడి సమస్యల్ని బయటపెడుతున్న కాక్రోచ్ లు, అందుకు తగిన ఫలితాల్ని కూడా అందుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం 12 వేల కోట్లతో స్కూళ్ల అభివృద్ది చేస్తామని ప్రకటించింది. ఆ తర్వాత పంజాబ్ ప్రభుత్వం శిధిలావస్ధలో ఉన్న స్కూలు భవనాలను కూల్చేయాలని ఆదేశాలిచ్చింది. దీని తర్వాత యూపీ ప్రభుత్వం కూడా 300 కోట్లతో 12 వేలకు పైగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ది చేసి స్మార్ట్ స్కూళ్లుగా చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+