నల్లమల జంగిల్ సఫారీ.. మారేడుమిల్లి కెనోపీ వాక్: పవన్ బిగ్ ప్లాన్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తోంది. దీంతో పాటు ప్రజల ఆరోగ్యకర జీవనానికి, గిరిజన యువతకు ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో.. నగర వన యోజన పథకాన్ని మరింత పదును పెడుతోంది. దీనికింద రాష్ట్రవ్యాప్తంగా నగర వనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది.

 స్థానిక ఎన్నికల వేళ పవన్ బిగ్ డెసిషన్ - నో కాంప్రమైజ్..!!
స్థానిక ఎన్నికల వేళ పవన్ బిగ్ డెసిషన్ - నో కాంప్రమైజ్..!!

ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ఆరు నగర ఉద్యానవనాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొద్దిసేపటి కిందటే ప్రారంభించారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగర వనాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. గతంలో రాష్ట్రంలో 19 నగర వనాలు ఉండగా, ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన ఆరింటితో కలిపి వాటి సంఖ్య 25కి చేరిందని తెలిపారు.

Deputy CM Pawan Kalyan has virtually inaugurated 6 urban forests in the AP Total reached at 25

నల్లమల అడవుల నుంచి మారేడుమిల్లి వరకు, బాపట్ల తీర ప్రాంత అందాల నుంచి కోటప్పకొండ ఆధ్యాత్మిక ప్రయాణం వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యాటక శోభను సంతరింపజేసేలా ఓ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోన్నామని పవన్ కల్యాణ్ వివరించారు. పర్యావరణాన్ని కాపాడుతూనే గిరిజనుల జీవనోపాధులను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని గుర్తు చేశారు.

Latest Survey: ఉమ్మడి తూర్పుగోదావరిలో కూటమి పరిస్ధితి ఏంటి ? తాజా సర్వేలో..!
Latest Survey: ఉమ్మడి తూర్పుగోదావరిలో కూటమి పరిస్ధితి ఏంటి ? తాజా సర్వేలో..!

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు మాట్లాడారు. ప్రకృతిని పరిరక్షిస్తూనే అభివృద్ధికి బాటలు వేయడమే పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానమని ప్రశసించారు. ప్రకృతి, ప్రజల ఉపాధి, పర్యాటకాభివృద్ధిని సమన్వయం చేస్తూ ఈ ఎకో టూరిజం ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయని చెప్పారు. ఈ బృహత్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

పెరుగుతున్న కాలుష్యానికి చెక్ పెడుతూ పట్టణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి ఈ నగర వనాలు పట్టణాలకు 'గ్రీన్ లంగ్స్'గా ఉపయోగపడతాయని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. స్థానికంగానే గిరిజనులకు ఉపాధి: ఎకో టూరిజం ప్రాజెక్టుల ద్వారా గిరిజన యువతకు స్వగ్రామాల్లోనే జీవనోపాధి అవకాశాలు మెరుగవుతాయని వివరించారు. నల్లమల జంగిల్ సఫారీ, మారేడుమిల్లి కెనోపీ వాక్ వంటి ప్రత్యేక ఆకర్షణలు రాష్ట్ర ప్రకృతి పర్యాటకానికి కొత్త ఊపును అందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+