అఫైర్ లేదు.. నాకు కాబోయే వ్యక్తికి ఈ గుణం ఉంటే చాలు: సుప్రీత ఓపెన్ టాక్ వైరల్!

ప్రముఖ సీనియర్ నటి సురేఖా వాణి కూతురు సుప్రీత తన తల్లి బాటలోనే నటిగా రాణించేందుకు సినీ రంగంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సుప్రీత.. ఇప్పటికే పలు టీవీ, ఓటీటీ షోలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్స్‌పై నెట్టింట నిరంతరం ఎన్నో ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. తాజాగా జబర్దస్త్ వర్ష యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఓ టాక్ షోలో పాల్గొన్న సుప్రీత.. తన జీవితంలోని చేదు అనుభవాలు, బ్రేకప్స్, ఆర్థిక పరిస్థితులపై ఓపెన్‌గా మాట్లాడి అభిమానులను ఆకట్టుకున్నారు.

కన్నడంలో సంచలనం సృష్టిస్తున్న మూవీ.. ఛాన్స్ మిస్ చేసుకున్న రుక్మిణి వసంత్
కన్నడంలో సంచలనం సృష్టిస్తున్న మూవీ.. ఛాన్స్ మిస్ చేసుకున్న రుక్మిణి వసంత్

నాకు కాబోయే వ్యక్తికి ఆ గుణం ఉంటే చాలు
తన పెళ్లి, రిలేషన్‌షిప్ గురించి అడగగా.. "నాకు కాబోయే వ్యక్తికి మంచి మనసు ఉంటే చాలు. బాహ్య సౌందర్యం కంటే మనసులోని స్వచ్ఛతకే నేను ప్రాధాన్యత ఇస్తాను. గత 25 ఏళ్లుగా నేను సింగిల్‌గానే ఉంటున్నాను. ఇటీవల నా పుట్టినరోజున ఇక సింగిల్‌గా ఉండలేను.. మంచి అబ్బాయిని వెతకండి అని అమ్మను అడిగాను. కానీ అమ్మ మాత్రం.. 'కొద్ది కాలం లైఫ్ ఎంజాయ్ చేయి, ఈ రోజుల్లో ఎవరికీ సరిగ్గా సింక్ అవ్వడం లేదు, విడాకులు ఎక్కువైపోతున్నాయి' అని వద్దని వారించింది. కానీ నేను మాత్రం నా భాగస్వామిని నా కంట్రోల్‌లో ఉంచుకుంటానని ధీమాగా చెప్పాను. నిజానికి పెళ్లయ్యాక మా అమ్మ నా కంటే నా భర్త వైపే ఎక్కువగా నిలబడుతుంది" అని సుప్రీత నవ్వుతూ సరదాగా చెప్పుకొచ్చారు.

Supritha Naidu Open Talk Surekha Vani Daughter Reveals Breakups Depression and EMI Struggles

మూడు సార్లు బ్రేకప్
తన ప్రేమ జీవితం ఎదుర్కొన్న పరాజయాలను గుర్తు చేసుకుంటూ సుప్రీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "నా జీవితంలో మూడు సార్లు బ్రేకప్ జరిగింది మొదటిది చిన్నతనంలో కాబట్టి దాని ప్రభావం అంతగా లేదు. కానీ రెండో రిలేషన్‌షిప్ బ్రేకప్ నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. జనంలోకి వెళ్తే డిప్రెషన్, బ్లాక్‌అవుట్ అయిపోయేదాన్ని. ఆ మానసిక ప్రశాంతత కోసం ఇప్పటికీ మందులు వాడుతున్నాను. ఆ ట్రామా నన్ను మూడో రిలేషన్‌షిప్ వైపు నడిపించింది. చీకటిలో వెలుగులా అతడు వచ్చాడని అనుకున్నాను కానీ ఆ వెలుగు ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రతీ చిన్న విషయానికి ఏడవడం, ఎక్కువగా ఆలోచించి నన్ను నేను నరకంలోకి నెట్టుకోవడం వల్ల ఆ బంధం కూడా ముగిసిపోయింది" అని సుప్రీత వెల్లడించారు.

JAILER 2 Official Trailer: రజనీకాంత్ 'జైలర్ 2' ట్రైలర్ రిలీజ్..
JAILER 2 Official Trailer: రజనీకాంత్ 'జైలర్ 2' ట్రైలర్ రిలీజ్..

ఈగోల వల్లే రిలేషన్స్ నిలవడం లేదు..
ప్రస్తుత కాలంలో బంధాలు నిలవకపోవడానికి ప్రధాన కారణం ఈగోలేనని ఆమె అభిప్రాయపడ్డారు. "ఇప్పుడు ఎవరికీ ఓర్పు, సహనం ఉండటం లేదు. ఒకే చోట కూర్చొని సమస్యను పరిష్కరించుకుందాం అనే ఆసక్తి ఎవరికీ లేదు. ఒకరి కోసం నా షూటింగ్స్, టైమింగ్స్, ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ అన్నింటినీ మార్చుకున్నాను. ప్రతీ క్షణం వాళ్లతోనే గడపాలని ఆరాటపడ్డాను. కానీ అవతలి వారి నుంచి ఆ స్పందన రాలేదు. మనం మారినా కొన్నిసార్లు బంధాలు బాగుపడవు. ఈగోలు, అసూయ, అర్థం చేసుకోకపోవడం వంటివి బంధాలను దెబ్బతీస్తాయి. ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో నెగెటివ్ విమర్శలు ఎదుర్కొంటున్నాం. ఇంటికొచ్చాక మన బాధను పంచుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం కావాలి. కానీ అక్కడ కూడా ఈగో ఘర్షణలే ఎదురవుతున్నాయి. చివరికి నా కెరీర్ నాకు ముఖ్యమం అని గ్రహించి ఆ బంధాల నుంచి బయటపడ్డాను" అని సుప్రీత తెలిపారు.

ఆర్థిక కష్టాలు.. సొంత ఇల్లే నాకల
ఇదే సందర్భంలో తమ ఆర్థిక పరిస్థితిపై కూడా సుప్రీత స్పందించారు. " మా అమ్మ సినిమాలకు దూరంగా లేరు, అవకాశాలు సరిగ్గా రాకపోవడం వల్లే తెరపై తక్కువగా కనిపిస్తున్నారు. చాలా మంది అనుకుంటున్నట్లు మేమేమీ ఆర్థికంగా పూర్తిగా స్థిరపడలేదు. ఇంకా పాత ఇంట్లోనే నివసిస్తున్నాం. గతంలో ఆర్థిక అవసరాల కోసం ఇంట్లోని కొన్ని వస్తువులను అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ మేము వాడుతున్న కార్లు కూడా ఈఎంఐలపైనే నడుస్తున్నాయి. ఎలాగైనా కష్టపడి ఈ ఏడాది నాటికి హైదరాబాద్ లో ఓ సొంత ఇల్లు కొనడమే నా ముందున్న అతిపెద్ద లక్ష్యం" అని సుప్రీత స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+