"నీకు ఎయిడ్స్ ఉందా?".. మాజీ ప్రియుడిపై నటి షాకింగ్ కామెంట్స్!

మలయాళ నటి, బిగ్ బాస్ 8 మలయాళం కంటెస్టెంట్ గాయత్రీ సురేష్(34) తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అత్యంత చేదు అనుభవాలను, చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 2015లో 'జమ్నా ప్యారీ' సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గాయత్రీ.. ఇటీవల బిగ్ బాస్ షోలో జరిగిన మాస్ ఎవిక్షన్ ద్వారా హౌస్ నుంచి బయటకు వచ్చారు. బయటకు రాకముందు జరిగిన ఓ టాస్క్‌లో తన మాజీ భాగస్వామితో ఉన్న టాక్సిక్ రిలేషన్‌షిప్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు.

JAILER 2 Official Trailer: రజనీకాంత్ 'జైలర్ 2' ట్రైలర్ రిలీజ్..
JAILER 2 Official Trailer: రజనీకాంత్ 'జైలర్ 2' ట్రైలర్ రిలీజ్..

"నీకు ఎయిడ్స్ ఉందా?" అని అడిగిన ప్రియుడు
2021లో తాను ఓ 'సిట్యుయేషన్‌షిప్'లో ఉన్నానని.. దాన్ని ఓ నిజమైన బంధం అనుకొని పొరపాటు పడ్డానని గాయత్రీ సురేష్ వెల్లడించారు. బంధం మొదలైన మొదటి వారంలోనే అతడు "నీకు ఎయిడ్స్ ఉందా?" అని అడిగినట్లు నటి గాయత్రీ సురేష్ పేర్కొన్నారు. ఆ మాట వినగానే తాను అతనితో మాట్లాడటం ఆపేసినప్పటికీ.. మళ్లీ అతనికి అవకాశాలు ఇస్తూ బంధాన్ని కొనసాగించానని తెలిపారు. అయితే ఆ తర్వాత అతనికి ఎర్నాకులంలో మరో అమ్మాయితో సంబంధం ఉందనే విషయం తనకి తెలిసిందన్నారు.

Gayathri Suresh Reveals Toxic Relationship Ex-Boyfriend Asked Shocking Question About AIDS

వివాదాస్పద కారు యాక్సిడెంట్
2021 అక్టోబర్లో జరిగిన వివాదాస్పద కార్ యాక్సిడెంట్ గురించిన నిజాన్ని కూడా గాయత్రీ తెలిపారు. ఆ సమయంలో తీవ్ర మనోవేదన అనుభవిస్తున్న తాను, అతన్ని కలవాలని పట్టుబట్టి అతడితో కలిసి కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగిందని వెల్లడించారు. అతడు కారు నడుపుతుండగా.. మరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత అతు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా.. స్థానికులు వెంటాడి పట్టుకున్నారని తెలిపారు. ఈ ఘటన తర్వాత పోలీసులు వచ్చి అతడిని స్టేషన్ కు తీసుకెళ్లారని.. తిరిగొచ్చాక తనను ఓ కేఫ్ లో ఒంటరిగా వదిలేసి.. అతడు తన మరో గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లిపోయాడని వాపోయారు

పండగ రేసు నుంచి తప్పుకున్న వెంకటేశ్ సినిమా.. ఫ్యాన్స్ కు పెద్ద షాక్..
పండగ రేసు నుంచి తప్పుకున్న వెంకటేశ్ సినిమా.. ఫ్యాన్స్ కు పెద్ద షాక్..

స్వార్థపూరిత బంధం నుంచి బయటపడ్డాను: గాయత్రీ సురేష్
ఈ సంఘటన తన జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణమని నటి గాయత్రీ గుర్తుచేసుకున్నారు అది ఓ స్వార్థపూరిత బంధమని, ఆ తర్వాతే తాను మానసికంగా మరింత బలంగా తయారయ్యానని చెప్పారు. ఇప్పుడు గతాన్ని గుర్తుచేసుకుంటే తనను వదిలేసి వెళ్లినందుకు అతనికే ధన్యవాదాలు చెప్పుకుంటానని, దానివల్లే తాను ఆ మానసిక వేధింపుల నుంచి బయటపడి ఓ మంచి వ్యక్తిగా మారగలిగానని ఆమె స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+