APSRTC ఆల్ టైమ్ రికార్డు! 100 కోట్ల మార్కు దాటేసిన స్త్రీ శక్తి

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం 'స్త్రీ శక్తి' ఒక అరుదైన, చారిత్రాత్మక రికార్డును నెలకొల్పింది. 2025 ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మహిళలు ఏకంగా 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 24 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని వెల్లడించింది. ఆడబిడ్డల ప్రయాణ భారాన్ని తగ్గించడమే కాకుండా ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిన ఈ పథకం విజయం పట్ల ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తూ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

APSRTC Stree Shakti Scheme Hits Historic Milestone Over 100 Crore Free Bus Trips Completed in AP
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. నెలకు సగటున 11 కోట్లకు పైగా ప్రయాణాలు..!
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. నెలకు సగటున 11 కోట్లకు పైగా ప్రయాణాలు..!

మహిళల జేబుల్లో రూ.3,500 కోట్ల పొదుపు!

ఈ పథకం ద్వారా కేవలం ఉచిత ప్రయాణమే కాకుండా మహిళలకు భారీ స్థాయి ఆర్థిక లబ్ధి చేకూరింది. ఆర్టీసీ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు జరిగిన 100 కోట్ల ప్రయాణాల ద్వారా రాష్ట్రంలోని మహిళలకు దాదాపు రూ.3,500 కోట్ల మేర ప్రయాణ వ్యయం ఆదా అయింది. రోజువారీ ఉద్యోగాలు చేసే మహిళలు, పాఠశాలలు-కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు, వ్యాపారులు, చిన్నచిన్న పనుల కోసం వెళ్లే పేద మహిళలకు ఈ పొదుపు ఎంతో కొండంత అండగా మారింది. బస్సు ఛార్జీల రూపంలో మిగిలిన ఈ మొత్తాన్ని మహిళలు తమ పిల్లల చదువులు, వైద్యం, ఇళ్ల అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు.

ఏపీలో దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం.. వారికి ఉచితం, సహాయకులకూ బెనిఫిట్!
ఏపీలో దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం.. వారికి ఉచితం, సహాయకులకూ బెనిఫిట్!

సిబ్బంది సమర్థతకు ఆర్టీసీ ఛైర్మన్ ప్రశంసలు!

రోజుకు లక్షలాది మంది మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మరియు ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది కీలక పాత్ర పోషించారని కొనకళ్ల నారాయణరావు ప్రశంసించారు. 100 కోట్ల మార్కును చేరుకోవడం సంస్థ చరిత్రలోనే గొప్ప ఘట్టమని, రాబోయే రోజుల్లో కూడా మహిళా ప్రయాణికులకు మరింత భద్రత, సురక్షితమైన ప్రయాణ వాతావరణాన్ని అందిస్తూ సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా సేవలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+