ఐపీఎల్ లో ఆ జట్టు హెడ్ కోచ్ గా సౌరవ్ దాదా
ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో పలు కీలక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటోన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లో గోవా వేదికగా మినీ ఆక్షన్ గడువు సమీపిస్తోన్న కొద్దీ మరింత తీవ్రతరమౌతోన్నాయి. వివిధ ఫ్రాంఛైజీలు ప్లేయర్లు, హెడ్ కోచ్, సపోర్టింగ్ స్టాఫ్ లో భారీ మార్పులకు తెర తీస్తోన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం.. నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏకంగా హెడ్ కోచ్ నే మార్చివేసింది.
ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఛాంపియన్ గా ఆవిర్భవించలేదీ ఫ్రాంఛైజీ. కప్ ను అందుకోలేదు. వచ్చే సీజన్ లో ఈ లోటును ఎలాగైనా బర్తీ చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కేప్టెన్ సౌరవ్ గంగూలీని హెడ్ కోచ్ గా నియమించింది. ఇప్పటివరకు ఈ హోదాలో హేమంగ్ బదాని కొనసాగారు. 2025, 2026 సీజన్లకు ఆయన హెడ్ కోచ్ గా వ్యవహరించారు. ఈ సారి ఆయనను పక్కనపెట్టిందా ఫ్రాంఛైజీ మేనేజ్మెంట్.

సౌరవ్ గంగూలీని హెడ్ కోచ్ గా అపాయింట్ చేసింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి కిందటే అధికారికంగా ప్రకటించింది. గంగూలీ 2023లో ఢిల్లీ కేపిటల్స్‌కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది.. ఆయన దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ప్రిటోరియా కేపిటల్స్‌కు హెడ్ కోచ్‌గా కూడా పనిచేశారు. ఇది.. ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీకి చెందిన జట్టే. ఇప్పుడు ఆయన ఐపీఎల్‌లో కూడా అదే జట్టుకు హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు.
దీంతో కోచింగ్ స్టాఫ్ మొత్తం కూడా మారిపోయే అవకాశం ఉంది. బౌలింగ్, బ్యాటింగ్ కోచ్ లుగా ఎవరిని నియామిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. వీటి వివరాలన అధికారికంగా ప్రకటించలేదు. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ చమింద వాస్, టీమిండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా పేర్లు ప్రధానంగా వినిపిస్తోన్నాయి.
యువరాజ్‌కు బ్యాటింగ్ కోచ్ గా బాధ్యతలు అప్పగించవచ్చని తెలుస్తోంది. బౌలింగ్ కోచ్‌గా చమింద వాస్ ను అపాయింట్ చేయడంతో పాటు అమిత్ మిశ్రాను సపోర్టింగ్ స్టాఫ్ లోకి తీసుకుంటారని చెబుతున్నారు. వీటిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. మాజీ కేప్టెన్ రిషభ్ పంత్ ఢిల్లీ కేపిటల్స్ లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇదివరకు లక్నో సూపర్ జెయింట్స్ కేప్టెన్ గా వ్యవహరించాడీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. 2027 సీజన్ కోసం మళ్లీ డీసీతో కలిశాడు. ఇంత భారీ మార్పుల నేపథ్యంలో నెక్స్ట్ సీజన్ లో ఢిల్లీ కేపిటల్స్ ఎలా ఆడుతుందనేది చర్చనీయాంశమౌతోంది.














Click it and Unblock the Notifications
