సూర్యకుమార్ యాదవ్ కు మరో బిగ్ షాక్..! ముంబై నుంచీ అవుట్..!
ఈ ఏడాది ఆరంభం వరకూ టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ గా, స్టార్ బ్యాట్స్ మెన్ గా మెరుపులు మెరిపించి స్కైగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కు టైం అస్సలు కలిసి రావడం లేదు. ఇప్పటికే టీమిండియా ఆడుతున్న మూడు ఫార్మాట్లు వన్డే, టెస్టు, టీ20ల్లో జట్టులో చోటు కోల్పోయిన సూర్య కుమార్ యాదవ్ కు ఇప్పుడు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో ఆడుతున్న ముంబై జట్టులోనూ సూర్య స్ధానం దక్కించుకోలేకపోయాడు.
అక్టోబర్ 11న చండీగఢ్‌తో జరగనున్న రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉన్నప్పటికీ ముంబై సెలెక్టర్లు అతన్ని పరిగణనలోకి తీసుకోలేదు. సూర్యకుమార్ తనను ఎంపిక చేయాలని ముంబై సెలక్షన్ కమిటీకి సందేశం పంపినప్పటికీ, అతడిని జట్టులోకి తీసుకోలేదని సమాచారం. రమేష్ పవార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ రెడ్-బాల్ ఫామ్‌పై పూర్తిగా నమ్మకం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. సూర్యకుమార్ చివరిసారిగా జూన్‌లో ముంబై టీ20 లీగ్‌లో పోటీ మ్యాచ్ ఆడాడు. అలాగే గత 18 నెలలుగా అతడు రెడ్-బాల్ క్రికెట్ మ్యాచ్ ఆడలేదు. సూర్యకుమార్‌ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదన్న అంశంపై ముంబై సెలెక్టర్ రమేష్ పవార్ వివరణ ఇచ్చారు.

సూర్యకుమార్ ముంబై తరఫున నిరూపితమైన ఆటగాడని, అయితే రెడ్-బాల్ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి ముందుగా కొన్ని మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రంజీట్రోఫీ కోసం ప్రకటించిన ముంబై జట్టుకు సిద్ధేశ్ లాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా 19 ఏళ్ల యువ బ్యాటర్ ఆయుష్ మాత్రేకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌కు టైటిల్ అందించడంలో నాయకత్వ పాత్ర పోషించిన మాత్రేను భవిష్యత్ కెప్టెన్‌గా తీర్చిదిద్దే ఉద్దేశంతో సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అలాగే భారత టెస్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై 16 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్‌తో నవంబర్‌లో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు రంజీ మ్యాచ్‌ల ద్వారా యశస్వీకి విలువైన మ్యాచ్ ప్రాక్టీస్ లభించనుంది. అయితే సీనియర్ బ్యాట్స్ మెన్ సర్ఫరాజ్ ఖాన్‌కు నాయకత్వ బాధ్యతలు ఇవ్వకుండా నేరుగా 19 ఏళ్ల మాత్రేకు వైస్ కెప్టెన్సీ అప్పగించడం కూడా ఆసక్తికరంగా మారింది.














Click it and Unblock the Notifications
