ఉత్తరాంధ్రపై జగన్ బిగ్ ప్లాన్, కీలక నేతకు బాధ్యతలు- అక్కడే మకాం..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. స్థానిక ఎన్నికల వేళ కూటమి- వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయ వ్యూహాలు అమలు అవుతున్నాయి. కూటమిలో సీట్ల పంపకాల పైనా మూడు పార్టీల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఇటు జగన్ సీట్ల ఖరారు బాధ్యతలను పార్టీలోని ప్రాంతీయ సమన్వయకర్తలకు అప్పగించారు. కాగా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ జగన్ వ్యూహం మార్చారు. కీలక నిర్ణయం తీసుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నియోజకవర్గాల వారీ గా పరిస్థితుల పైన చర్చించారు. కన్నబాబు, బొత్సాతో ప్రత్యేకంగా ఒన్ టు ఇన్ సమావేశమైన జగన్ తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా సమాచారం అడిగి గెలుసుకున్నారు.

మజ్జి శ్రీను పార్టీ వీడిన తరువాత విజయనగరంలో ప్రభావం.. మజ్జి శ్రీను కోసం ఇంకా ఎవరైనా పార్టీ వీడే అవకాశం ఉందా.. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశాల పైన సుదీర్ఘంగా చర్చించారు. కొందరు నేతలు మజ్జి శ్రీనుతో టచ్ లో ఉన్నా... కూటమిలో విజయనగరం జిల్లా కేంద్రంగా నెలకొని ఉన్న పరిస్థితుల్లో పెద్దగా ఆసక్తి చూపటం లేదని జగన్ కు నేతలు వివరించారు. అదే విధంగా శ్రీకాకుళం లో తమ్మినేని సీతారాం కుమారుడు చేసిన వ్యాఖ్యల పైనా జగన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.
ఈ నెలాఖరు లోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అంచనా వేస్తున్న వేళ.. మూడు ఉమ్మడి జిల్లాల్లో కార్పోరేషన్లు, మున్సిపాల్టీల వారీగా మేయర్- ఛైర్మన్ అభ్యర్దుల ఖరారు.. సామాజిక సమీక రణాల పైనా కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నెల 29 లేదా 30న విశాఖ కేంద్రంగా జగన్ ఉత్తరాంధ్ర రీజియన్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు దిశగా ఆలోచన చేసినట్లు సమాచారం. ఈ సమావేశం పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా.. మూడు జిల్లాల నేతలతో నియోజక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని బొత్సా- కన్నబాబు కు జగన్ ఆదేశించారు.
పార్టీ ఎవరైనా వీడినా.. వారి స్థానంలో తొలి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని.. కేడర్ కు మద్దతు గా నిలవాలని సూచించినట్లు తెలుస్తోంది. భీమిలి నియోజకవర్గ ఇంఛార్జ్ అంశం పైనా చర్చ జరిగింది. అయితే, అక్కడ ఒకటి రెండు రోజుల్లోనే కొత్త ఇంఛార్జ్ ను ఖరారు చేస్తానని జగన్ చెప్పినట్లు సమాచారం. దీంతో.. ఉత్తరాంధ్ర కేంద్రంగా రానున్న రోజుల్లో జగన్ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications
