USA చరిత్రలోనే అతిపెద్ద నిర్ణయం.. ఏకంగా పౌరసత్వాలు రద్దు!

అమెరికా ప్రభుత్వం వలసదారులపై విరుచుకుపడుతూ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా, దొంగ మార్గాల్లో అమెరికా పౌరసత్వాన్ని సొంతం చేసుకున్న 40 మంది పౌరసత్వాలను రద్దు చేసేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. తప్పుడు సమాచారం ఇచ్చి, అసలు నిజాలను దాచి పౌరసత్వం పొందిన వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ అసిస్టెంట్ అటార్నీ జనరల్ బ్రెట్ ఎ. షూమేట్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ జాబితాలో ఒక భారతీయ మూలాలున్న వ్యక్తితో పాటు చైనా, పాకిస్తాన్, మెక్సికో, నేపాల్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడిన వ్యక్తులు ఉన్నారు.

కాలిఫోర్నియా ఇండియన్ బలి!

పౌరసత్వాన్ని రద్దు చేసే ప్రతిపాదన ఎదుర్కొంటున్న 40 మందిలో కాలిఫోర్నియాకు చెందిన బల్విందర్ సింగ్ అనే భారతీయ మూలాలున్న వ్యక్తి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1992లో బల్విందర్ సింగ్ పేరుతో అమెరికా వలస అప్లికేషన్ సమర్పించిన ఈయన, ఆ తర్వాత 2003లో మరొక నకిలీ ఐడెంటిటీని ఉపయోగించి గ్రీన్ కార్డ్ పొందాడు. ఆ తర్వాతి కాలంలో ఆ రెండో ఐడెంటిటీ ఆధారంగానే 2009లో అమెరికన్ పౌరసత్వాన్ని కూడా దక్కించుకున్నాడు. అయితే, వేలిముద్రల ఆధారంగా నిర్వహించిన విచారణలో రెండు అప్లికేషన్లు ఒకే వ్యక్తివని అధికారులు నిరూపించడమే కాకుండా, నైతిక ప్రవర్తనను దెబ్బతీసేలా మోసాలకు పాల్పడినందుకు అతని పౌరసత్వాన్ని రద్దు చేసే దిశగా కోర్టును ఆశ్రయించారు.

US Government Launches Largest Denaturalisation Drive 40 Citizens Including Indian-Origin Man Targeted
EB-5 visa: 'గ్రీన్ కార్డు' కల ఇక మరింత భారం.. భారీగా పెరిగిన ఫీజులు
EB-5 visa: 'గ్రీన్ కార్డు' కల ఇక మరింత భారం.. భారీగా పెరిగిన ఫీజులు

పెను ముప్పుగా మారిన తీవ్ర నేరాలు

కేవలం ఐడెంటిటీ మోసాలే కాకుండా, దేశ భద్రతకు ముప్పుగా మారిన నేరగాళ్లపై కూడా ఈ వేటు పడింది. ఇందులో చైనాలో జన్మించి అమెరికన్ నేవీలో సైనికుడిగా చేరిన జిన్‌చావో వేయ్ అనే వ్యక్తి కేస్ ప్రధానమైంది. అతను మిలిటరీ హోదాను ఉపయోగించుకుని సైనిక రహస్యాలను బీజింగ్‌కు విక్రయించే కుట్ర పన్ని పట్టుబడ్డాడు. గూఢచర్యానికి పాల్పడినందుకు ఇప్పటికే అతనికి 200 నెలల జైలు శిక్ష పడగా, ఇప్పుడు అతడి అమెరికన్ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నారు. వీరితో పాటు ప్రత్యేక అవసరాలున్న వారిపై దారుణమైన లైంగిక దాడికి పాల్పడటం, విదేశీ ప్రభుత్వాలకు ఏజెంట్లుగా వ్యవహరించడం మరియు హత్యలకు పాల్పడిన తీవ్ర నేరస్థులను కూడా ఈ జాబితాలో చేర్చారు.

H-1B visa: లబోదిబోమంటున్న ఐటీ దిగ్గజాలు! లక్ష డాలర్ల వీసా ఫీజు రెన్యూ..
H-1B visa: లబోదిబోమంటున్న ఐటీ దిగ్గజాలు! లక్ష డాలర్ల వీసా ఫీజు రెన్యూ..

రాబోయే రోజుల్లో మోసగాళ్లకు గడ్డుకాలమే!

వలసదారుల చట్టం ప్రకారం దొంగ మార్గాల్లో లేదా నిబంధనలకు విరుద్ధంగా పొందిన పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం అమెరికా ప్రభుత్వానికి ఉంటుంది. "వచ్చిన ప్రతి ఒక్కరూ అబద్ధాలు చెప్పే అమెరికా పౌరసత్వం పొందారు" అని అసిస్టెంట్ అటార్నీ జనరల్ ఘాటుగా వ్యాఖ్యానించారు. దేశ పౌరసత్వ వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడమే తమ ప్రాథమిక లక్ష్యమని, మోసపూరిత మార్గాల్లో పౌరసత్వాలు పొందిన వారిపై ఈ రకమైన చర్యలు భవిష్యత్తులోనూ నిరంతరాయంగా కొనసాగుతాయని జస్టిస్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+