సౌదీకి హుతీల మరో భారీ షాక్..! అమెరికా ఇచ్చిన ఎఫ్-15 జెట్ కూల్చివేత..!

పశ్చిమాసియాలో సౌదీ అరేబియా-హుతీల పోరు మరింత తీవ్రమవుతోంది. యెమెన్ లో ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతిస్తున్న నేపథ్యంలో.. అక్కడ రెబెల్స్ గా ఉన్న హుతీలు (houthis) ఎదురుదాడులకు దిగుతున్నారు. ఇదే క్రమంలో ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్-మాండెబ్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తాజాగా ప్రకటించారు. తాజాగా మరో అడుగు ముందుకేసి సౌదీ అరేబియాలోని ముస్లింల పవిత్ర నగరం మక్కాపై డ్రోన్లు ప్రయోగించారు. అయితే వీటిని సౌదీ సమర్దంగా అడ్డుకుని మక్కాలో అలర్ట్ ప్రకటించింది.

హౌతీల దెబ్బకు దిక్కుతోచని సౌదీ ..! సీక్రెట్ గా శత్రుదేశం ఇజ్రాయెల్ వద్దకు.!
హౌతీల దెబ్బకు దిక్కుతోచని సౌదీ ..! సీక్రెట్ గా శత్రుదేశం ఇజ్రాయెల్ వద్దకు.!

ఈ ఘటన చోటు చేసుకున్న కొద్ది గంటల్లోనే యెమెన్ గగనతలంపై ఎగురుతున్న సౌదీ ఎఫ్ 15 ఫైటర్ జెట్ ను కూల్చేసినట్లు హుతీలు ప్రకటించారు. మిత్రదేశం అమెరికా నుంచి తీసుకుని వాడుతున్న ఎఫ్15 ఫైటర్ జెట్ ను హుతీలు కూల్చేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. నిన్న మొన్నటివరకూ హుతీల్ని యెమెన్ లో ఇరాన్ మద్దతు కలిగిన చిన్న రెబెల్ గ్రూప్ గా పరిగణించిన వారికి ఇప్పుడు వారి సత్తా తెలుస్తోంది. ఇరాన్ ఇచ్చిన క్షిపణులు, డ్రోన్లతో సౌదీ మీద హుతీలు చేస్తున్న యుద్దం నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

Houthis Claim Saudi F-15 Shot Down Hours After Drone Intercepted Near Mecca
హూతీల చేతికి బాబ్ ఎల్-మాండెబ్..! 3వేల కి.మీ దూరంలో భారత్ కు మరో టెన్షన్..!
హూతీల చేతికి బాబ్ ఎల్-మాండెబ్..! 3వేల కి.మీ దూరంలో భారత్ కు మరో టెన్షన్..!

యెమెన్‌లోని వివాదాస్పద మరిబ్ ప్రావిన్స్ గగనతలంలో సౌదీ అరేబియాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని విజయవంతంగా కూల్చివేసినట్లు హుతీ సైనిక దళాలు ప్రకటించాయి. తమ స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన ఉపరితలం నుండి గగనతలంలోకి దూసుకెళ్లే అత్యాధునిక క్షిపణి సహాయంతో ఈ విమానాన్ని నేలకూల్చినట్లు హుతీ ప్రతినిధి యాహ్యా సారీ తెలిపారు. అయితే హుతీల ఆరోపణలను సౌదీ అరేబియా ప్రభుత్వం ధృవీకరించలేదు. మక్కా నగరం తమకు అత్యంత పవిత్రమైనదని, దాని భద్రత విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తి లేదని సౌదీ సంకీర్ణ దళాలు హెచ్చరించాయి. కాగా తాము పవిత్ర ఇస్లామిక్ క్షేత్రాలకు ఎలాంటి హాని తలపెట్టలేదని హుతీ ప్రతినిధులు స్పష్టం చేశారు.

Mecca: మక్కా నగరానికి వైమానిక దాడి అలర్ట్ ..! చరిత్రలో ఇదే తొలిసారి..!
Mecca: మక్కా నగరానికి వైమానిక దాడి అలర్ట్ ..! చరిత్రలో ఇదే తొలిసారి..!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+