జబర్దస్త్ కమెడియన్ నరేష్ అసలు వయస్సు ఇదే..!
అనుకున్నది సాధించాలంటే అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించేవారు మన చుట్టూ చాలా మందే ఉంటారు. కాళ్లు.. చేతులు సరిగా ఉన్నా బద్ధకంతో తమ పని తాము చేసుకోలేని నేటి యువతకు ఇలాంటి వారు ఎంతో స్ఫూర్తిదాయకం. ఇక జబర్దస్త్ కమెడియన్ పొట్టి నరేష్ కూడా వీరిలోంచి వచ్చిన వ్యక్తే..తెలుగు బుల్లితెరపై తనదైన కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ పొట్టి నరేష్ .. చూడ్డానికి పదేళ్ల పిల్లాడిలా ఉంటాడు. జన్యుపరమైన లోపం కారణంగా చిన్న వయసులోనే అతని శరీరంలో ఎదుగుదల ఆగిపోయింది. అయినా అతడు ఏనాడూ బాధపడి ఇంట్లో కూర్చోలేదు. తన శారీరక వైకల్యాన్ని బలహీనతగా భావించకుండా దానినే తనకు ప్లస్ గా మార్చుకుని ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. జబర్దస్త్ షోలోని స్కిట్లలో తనదైన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్, పంచ్ లతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. అలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ను ఏర్పాటు చేసుకున్నాడు.
జబర్దస్త్ షోతో టెలివిజన్ లో తనకంటూ ప్రత్యేకమైన కామెడీ ఇమేజ్ తెచ్చుకున్న నరేష్.. సినిమాల్లోనూ తనదైన శైలిలో పాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ 10 లో హౌస్ లోకి ఒక కంటెస్టెంట్ గా నరేష్ అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో లోనూ మొదటి టాస్క్ లోనే పవర్ కీ గెలుచుకుని తన సత్తా చాటాడు. అయితే నరేష్ చూడ్డానికి చాలా చిన్నపిల్లాడిలా పొట్టిగా ఉంటాడు. కానీ అతని వయసు తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. అవును.. నరేష్ వయసు దాదాపు 35 ఏళ్లు అని.. జన్యుపరమైన లోపం వల్ల ఎదగలేదని సమాచారం. అయితే పొట్టిగా ఉండటమే తన కెరీర్ కు ప్లస్ అయిందని, టాప్ కమెడియన్ గా ఎదిగాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇక ఇటీవల పెళ్లి విషయంపై జబర్దస్త్ నరేష్ మాట్లాడుతూ.. తనను అర్థం చేసుకునే భార్య కావాలని కోరుకున్నాడు. తన జీవితంలో ఎదురైన పరిస్థితులను అర్థం చేసుకుని తనతో కలిసి ముందుకు వెళ్లే భాగస్వామి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక నరేష్ వయసు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications
