పనీర్‌ రెగ్యులర్ గా తింటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!

పనీర్ అందరూ ఇష్టపడే ఆహారం. పనీర్ ద్వారా ప్రొటీన్స్ అందుతాయి. ఇందులో సెలీనియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన శక్తిని తక్షణమే అందిస్తుంది. కండరాలను బలంగా మారుస్తుంది, కణాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. అయితే, పనీర్ రెగ్యులర్ గా తీసుకునే వారికి నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. పరిమితి తో పాటుగా ఏ సమయంలో తీసుకుంటే ప్రయోజనకరమో వివరిస్తున్నారు.

పనీర్ వినియోగం ఈ మధ్య కాలంలో పెరిగింది. 100 గ్రాముల పనీర్‌లో సుమారు 18 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇది శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అవసరాన్ని తీర్చడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.రోజువారీ డైట్‌లో పనీర్ చేర్చుకోవడం వల్ల ఎముకల బలహీనత సమస్యలు తగ్గే అవకాశం ఉంది. పన్నీర్ లో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. పన్నీర్ తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారం. ఇది శాఖాహారులకు మంచి ప్రోటీన్ ను ఇచ్చే ఫుడ్. ఇది మన శరీరం సరైన పనితీరును కనబరిచే అవసరమైన ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. పనీర్‌లో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా నిరోధించి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే పనీర్ ను పరిమితంగా తీసుకోవటం అవసరమని నిపుణులు చెబుతున్నారు.

 TTD గోల్డెన్ ఛాన్స్, ఒకే రోజు ఒకే టికెట్‌తో రెండు సార్లు శ్రీవారి ప్రత్యేక దర్శనం- ఇలా చేయండి..!!
TTD గోల్డెన్ ఛాన్స్, ఒకే రోజు ఒకే టికెట్‌తో రెండు సార్లు శ్రీవారి ప్రత్యేక దర్శనం- ఇలా చేయండి..!!
paneer-is-a-rich-source-of-protein-and-calcium-both-of-which-aid-in-bone-metabolism-it-is-also-rich

నిపుణుల సూచనలు

పనీర్ తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఇందులో కొవ్వు, ప్రోటీన్ రెండూ సమపాళ్లలో ఉండటంతో శక్తివంతమైన ఆహారంగా పనిచేస్తుంది. శారీరక శ్రమ చేసేవారు, వ్యాయామం చేసే వ్యక్తులకు ఇది ఎంతో ఉపయోగకరం. కడుపు నిండిన భావాన్ని కలిగించడం ద్వారా అతిగా తినకుండా ఉండటానికి సహాయపడుతుంది. పన్నీర్ రక్తంలో చక్కెరను కంట్రోల్ చేస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి ఎంతగానో దోహదం చేస్తుంది. పన్నీర్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ ను పెంచుతుంది. ఎముకలు మరియు దంతాలకు పన్నీర్ ఎంతో మేలు చేస్తుంది. పన్నీర్ మన మానసిక ఆందోళనను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. నరాల సంబంధిత అనేక సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తుంది. పనీర్ అధిక కేలరీలు కలిగి ఉండటంతో అధికంగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. బరువు తగ్గాలనుకునేవారు మితంగా తీసుకోవడం మంచిది. పనీర్ తిన్న తర్వాత కడుపులో అసౌకర్యం, గ్యాస్, ఉబ్బరం లాంటి అజీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో.. నాణ్యమైన.. పరిమితమైన పనీర్ తీసుకోవటం ద్వారా అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+