జగన్ పార్టీకి సెక్యులర్ ఓట్లు, ఏడుస్తారు: డొక్కా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రాబబు నాయుడు, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ జోడీని సీమాంధ్రులు వ్యతిరేకించారని కాంగ్రెసు నాయకుడు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఆ జోడీ వ్యతిరేక ఓట్లు కాంగ్రెసు పార్టీకి లేదా వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పడ్డాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిస్తే సెక్యులర్ ఓట్లుగా భావించాలని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యపాలైందని మాజీ మంత్రి డొక్కామాణిక్యవరప్రసాద్ విమర్శించారు. సీమాంధ్ర ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు డబ్బులు విపరీతంగా ఖర్చు చేశారని ఆయన అన్నారు.

అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. డబ్బులు పంచిన కొందరు అభ్యర్థులు రాజకీయంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బ తిని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో సీమాంధ్రలో గెలిచిన అభ్యర్థులు ఇంటికెళ్లి ఏడుస్తారని, ఓడిపోయిన వారు కౌంటింగ్ కేంద్రంలో ఏడుస్తారన్నారు. అభ్యుర్థులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications