శేషాచలం ఎన్‌కౌంటర్: ఎపి బస్సులపై ఆగని దాడులు
తిరుపతి: శేషాచలం ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఆంధ్రా బస్సులపై తమిళుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం సాయంత్రం పలు చోట్లు ఆంధ్రప్రదేశ్ బస్సులపై దాడులు జరిగాయి. సోమవారం సాయంత్రం కాళహస్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుపై ఆంధ్రా సరిహద్దు ప్రాంతమై న పన్నంగాడు వద్ద రాళ్లతో దాడి చేశారు. దీంతో బస్సు సిబ్బంది తడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇదే సమయంలో చిత్తూరు డిపోకు చెందిన మరో ఆర్టీసీ బస్సును తమిళనాడు ప్రాంతంలో గుమ్మడిపూండి సమీపంలో చిన్న ఓబులాపురం వద్ద చెన్నైకు నుంచి తిరుమలకు వస్తున్న కాళహస్తి డిపో బస్సును బ్రిడ్జిపైనుంచి బస్సుపై రాళ్లు రువ్వారు.
దీంతో బస్సు ముందు అద్దాలు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ పి ఎం ఆర్ రెడ్డికి స్వల్పగాయాలు అయ్యాయి. దీంతో బస్సు సిబ్బంది ఆరంబాకం స్టేషన్‌లో ఫిర్యాదు చేసి తిరుమలకు బయలుదేరారు.

అంతేకాకుండా, కర్నూలు జిల్లా నంద్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుపై కూడా తమిళనాడు ప్రాంతంలోని చోళవరం వద్ద రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం.
చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో పోలీసుల చేతిలో 20 మంది తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు హతమయ్యారు. అప్పటి నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఎపి బస్సులపై తమిళులు దాడులు చేస్తూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications