Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రఘురామ ఫిర్యాదు-కదిలిన కేంద్రం-జగన్ సర్కార్ కు భారీ ఝలక్

గత కొన్నేళ్లుగా అప్పులతో నడుస్తున్న ఏపీ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం భారీ పిడుగు వేసింది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు కోసం కూడా రుణాలపైనే ఆధారపడుతున్న వైసీపీ సర్కార్ కు భారీ షాకిచ్చింది. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంాజు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం.. జగన్ సర్కార్ వివరణ కోరింది. ఏపీఎస్డీసీ ద్వారా సేకరిస్తున్న రుణాలతో సంక్షేమ పథకాలను లాక్కొస్తున్న ప్రభుత్వానికి ఇది శరాఘాతంగా మారబోతోంది. వచ్చే 20 ఏళ్ల మద్యం ఆదాయాన్ని గ్యారంటీగా పెట్టి మరీ రుణాలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ఇది రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ఆర్ధికశాఖ తేల్చిచెప్పింది.

 జగన్ సర్కార్ కు భారీ షాక్

జగన్ సర్కార్ కు భారీ షాక్

ఏపీలో రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ పేరుతో గతేడాది ఓ సంస్ధను ఏర్పాటు చేసి దాని ద్వారా రుణాలు తీసుకుని నవరత్నాల్లోని సంక్షేమ పథకాలు నడిపిస్తున్న జగన్ సర్కార్ కు కేంద్రం భారీ షాకిచ్చింది. ఏపీ ఎస్డీసీ పేరుతో రుణాలు తీసుకుంటూ వాటిని సంక్షేమ పథకాలకు వాడుకోవడం, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల్ని, భవిష్యత్ ఆదాయాల్ని తాకట్టు పెట్టడాన్ని తప్పుపడుతూ కేంద్ర ఆర్ధిక శాఖలోని వ్యయ విభాగం పంపిన లేఖ ఇప్పుడు ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. ఈ లేఖలో పేర్కొన్న అంశాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో చట్ట సవరణ చేసి మరీ ఏపీఎస్డీసీ ద్వారా ఈ రుణాలు తీసుకుంటున్న ప్రభుత్వం కేంద్రం పంపిన లేఖతో ఇరుకునపడింది.

 రఘురామ ఫిర్యాదుతో

రఘురామ ఫిర్యాదుతో

ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ పేరుతో ఓ సంస్ధను ఏర్పాటు చేసి దాని ద్వారా వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున రుణాలు సేకరిస్తోందని, ఇందుకు ప్రభుత్వ ఆస్తుల్ని, భవిష్యత్ ఆదాయాన్ని తనఖా పెడుతుందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని మోడీకి, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కూ వేర్వేరు లేఖలు రాసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని కలెక్టరేట్లు, ఎమ్మార్వో ఆఫీసులు, ఇతర ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టి ఏపీఎస్డీసీ ద్వారా రుణాలు తీసుకుంటున్నట్లు రఘురామరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర ఆర్ధికశాఖలోని వ్యయ విభాగం దీనిపై స్పందించింది. ఏపీ ప్రభుత్వం ఎస్డీసీ ద్వారా చేస్తున్న అప్పులపై రఘురామరాజు రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో రఘురామరాజు మరో అంశంలో జగన్ సర్కార్ ను ఇరికించినట్లయింది.

 ఏపీఎస్డీసీ రాజ్యాంగ విరుద్ధం

ఏపీఎస్డీసీ రాజ్యాంగ విరుద్ధం

ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ ద్వారా రుణ సేకరణ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఏపీ ఆర్ధికశాఖకు రాసిన లేఖలో పేర్కొంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అవసరమైన రుణాల్ని బ్యాంకుల ద్వారా సేకరించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ఆర్ధికశాఖ జగన్ సర్కార్ కు రాసిన లేఖలో తెలిపింది. ఇందుకు తగిన ఆధారాలు ఉన్నట్లు వెల్లడించింది. వైసీపీ ఎంపీ రఘురామరాజు చేసిన ఫిర్యాదును బట్టి చూస్తుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 (3), ఆర్టికల్ 266 (1)కు విరుద్ధంగా ఈ సంస్ధ ఏర్పాటైనట్లు కేంద్ర ఆర్ధికశాఖ ఏపీ ప్రభుత్వానికి పంపిన లేఖలో తేల్చిచెప్పింది. ఈ రెండు ఆర్టికల్స్ ప్రకారం ఇలాంటి సంస్ధ ఏర్పాటుకు అవకాశం లేదని తెలిపింది. దీంతో రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటైన ఈ కార్పోరేషన్ పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

 మద్యం ఆదాయం గ్యారంటీనా ?

మద్యం ఆదాయం గ్యారంటీనా ?

మద్యం ద్వారా వచ్చే 20 ఏళ్లలో లభించే ఆదాయన్ని బ్యాంకు రుణాల కోసం జగన్ సర్కార్ గ్యారంటీగా పెట్టింది. అంటే మద్యం ద్వారా భవిష్యత్తులో లభించే ఆదాయంతో ఈ రుణాలు తీర్చబోతోంది. ఈ వ్యవహారాన్ని కేంద్ర ఆర్ధికశాఖ సీరియస్ గా తీసుకుంది. మద్యంపై ఏపీ ప్రభుత్వం విధిస్తున్న అదనపు సుంకంతో ఏపీఎస్డీసీ బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను తీర్చడంపై ఆర్దికశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం రూ.18500 కోట్ల మేర ఇలా రుణాలు తీసుకున్నట్లు ఆర్ధిక శాఖ తెలిపింది. దీంతో తమ ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం స్ధానంలో వచ్చే ప్రభుత్వాల ఆదాయాన్ని కూడా ఎలా గ్యారంటీగా పెడతారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 జగన్ సర్కార్ వివరణ కోరిన కేంద్రం

జగన్ సర్కార్ వివరణ కోరిన కేంద్రం

ఏపీలో రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ పేరుతో ఓ సంస్ధను రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేయడంతో పాటు దానికి భవిష్యత్ ప్రభుత్వాలు కూడా తాకట్టు పెట్టిన వ్యవహారంపై కేంద్రం జగన్ సర్కార్ నుంచి ఓ సమగ్ర నివేదిక కోరింది. ఏపీఎస్డీసీ ఏర్పాటుకు పాటించిన నిబంధనలు, దీని ద్వారా ఇప్పటివరకూ తీసుకున్న రుణాలు, వాటికి బ్యాంకులకు సమర్పించిన గ్యారంటీలు, మద్యం ఆదాయంపై ఇచ్చిన హామీ వంటి పలు అంశాల్ని కేంద్ర ఆర్ధికశాఖ కోరినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ సర్కార్ ఇరుకునపడింది. ఈ వివరాలన్నీ కేంద్రానికి ఇస్తే భవిష్యత్తులో రుణాలపై కచ్చితంగా ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Recommended Video

    Janasena Silence Over BJP's Fight Against AP Govt| YSRCP | Tippu Sultan | AP | Oneindia Telugu
     రఘురామకు మరో సక్సెస్

    రఘురామకు మరో సక్సెస్

    ఏపీఎస్డీసీ ద్వారా భారీ ఎత్తున రుణాలు సేకరించడం, ఇందుకోసం ప్రభుత్వ ఆస్తుల్ని, భవిష్యత్ ఆదాయాల్ని తనఖా పెట్టడంపై కేంద్ర ఆర్ధికశాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో రఘురామ రాజు వ్యూహం ఫలించినట్లయింది. కేంద్రం వద్ద జగన్ సర్కార్ ను ఇరుకునపెట్టేందుకు రఘురామరాజు వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. ఇప్పుడు కేంద్రం అడిగే వివరాలు ఇచ్చినా సమస్యే, ఇవ్వకున్నా సమస్యే అన్నట్లుగా జగన్ సర్కార్ పరిస్దితి మారనుంది. ఎందుకంటే వివరాలు ఇవ్వకపోతే ధిక్కారం అవుతుంది, అలాగని వివరాలు ఇస్తే భవిష్యత్తులో ఇచ్చే రుణాలపై కచ్చితంగా ప్రభావం పడబోతోంది. దీంతో జగన్ సర్కార్ పరిస్ధితి ముందునుయ్యి వెనుక గొయ్యిగా మారబోతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+