ఏపీలో తీరాన్ని తాకిన తుఫాన్- బీభత్సం: అతి భారీ వర్షాలు

అతి తీవ్ర తుఫాన్ మురాసు.. ఏపీ తీరాన్ని తాకింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఈ తెల్లవారు జామున తుఫాన్ తీరం దాటడం ప్రారంభించిందని భారత వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించాయి. ఈ సమయంలో తీరం వెంట గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తోన్నాయి. దీని తీవ్రత కారణంగా దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి.

వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్ ప్రకారం.. తుఫాన్ కేంద్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒంగోలుకు ఆగ్నేయంగా 20, కావలికి ఈశాన్యంగా- 70, బాపట్లకు దక్షిణంగా- 60, నెల్లూరుకు- 110, మచిలీపట్నానికి 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ బయటి మేఘాల పొరలు ఇప్పటికే తీరాన్ని తాకయి. ఫలితంగా 12 గంటల పాటు బాపట్ల, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

Severe cyclonic storm Murasu landfall near Ongole in Andhra Pradesh bringing heavy rainfall in State

తుఫాన్ కేంద్రం, లోపలి మేఘాల పొరలు తీరం మొత్తాన్నీ దాటడానికి కనీసం రెండు నుంచి రెండున్నర గంటల సమయం పట్టే అవకాశం ఉంది. తుఫాన్ ఉద్ధృతి వల్ల సముద్రంలో సాధారణ పోటు కంటే 1.5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతున్నాయి. దీనివల్ల లోతట్టు తీర ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల తీర ప్రాంతాల్లో చెట్లు విరిగిపడుతున్నాయి. సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. మత్స్యకార గ్రామాల్లోకి సముద్రపు నీరు ప్రవహించింది.

ఏపీ మీదుగా పట్టాలెక్కిన బెంగళూరు వందే భారత్ స్లీపర్: 8 హాల్ట్ స్టేషన్లు
ఏపీ మీదుగా పట్టాలెక్కిన బెంగళూరు వందే భారత్ స్లీపర్: 8 హాల్ట్ స్టేషన్లు

వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారడంతో ముందుజాగ్రత్త చర్యగా విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి నడిచే 19 దేశీయ విమాన సర్వీసులు ఇప్పటికే రద్దయ్యాయి. పల్నాడు జిల్లాలో గరిష్ఠంగా 30 సెంటీమీటర్లు, ప్రకాశంలో 24 సెంటీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదు కావొచ్చు. ముప్పు పూర్తిగా తొలిగిపోయే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పరిస్థితి తీవ్రతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తోన్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో 6,800 నీటిపారుదల చెరువులను నిరంతరం పర్యవేక్షించాలని, గండ్లు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. తమిళనాడు నుంచి 1,000 మంది, కర్ణాటక నుంచి 500 మంది విద్యుత్ సిబ్బంది ఏపీకి చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+