షాక్: ఈడీ ఛార్జీషీట్లో షబ్బీర్ అలీతో పాటు బొత్స, సుఖేష్‌ను రక్షించేందుకు రంగంలోకి
మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషి కేసులో ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీటు దాఖలు చేసింది. కేసు విచారణలో భాగంగా సతీశ్ సానా, కోనేరు ప్రదీప్ ఇచ్చిన వాంగ్మూలాన్ని పేర్కొంది.
న్యూఢిల్లీ: మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషి కేసులో ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీటు దాఖలు చేసింది. కేసు విచారణలో భాగంగా సతీశ్ సానా, కోనేరు ప్రదీప్ ఇచ్చిన వాంగ్మూలాన్ని పేర్కొంది.

బొత్స, షబ్బీర్ అలీలను స్నేహితులుగా చెప్పారు
సతీస్ సానా తన వాంగ్మూలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ, టి కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పేర్లు ప్రస్తావించినట్లుగా వెల్లడించింది. వారిద్దరూ తన స్నేహితులుగా సతీశ్ చెప్పినట్లు ఈడీ పేర్కొంది.

ఈడీ కేసులో షబ్బీర్ అలీ, బొత్స
దీంతో షబ్బీర్ అలీ, వైసీపీ నేత బొత్స సత్యానారాయణ ఈడీ కేసులో ఇరుక్కున్నారు. సీబీఐ కేసుల్లో ఇరుక్కున్న నిందితుల తరఫున సీబీఐ డైరెక్టర్లకు లంచాలు తీసుకెళ్లినట్లుగా ఈడీ వీరిద్దరిపై చార్జిషీట్ దాఖలు చేసిందని తెలుస్తోంది.

ఖురేషీ ద్వారా నిధులు
సీబీఐ మాజీ డైరెక్టర్లు ఏపీ సింగ్, రంజిత్ సిన్హాకు హవాలా మార్గంలో నిధులు అందించిన ప్రధాన నిందితుడు మొయిన్ ఖురేషీతో పాటు ఈడీ చార్జిషీట్‌లో షబ్బీర్ అలీ, బొత్స పేర్లు కూడా ఉన్నాయి.

సుఖేష్ గుప్తాకు బెయిల్ కోసం
ఎంబీఎస్ జ్యూయలర్స్ యజమాని సుఖేష్ గుప్తాకు బెయిల్ ఇప్పించేందుకు సతీష్ సనా ద్వారా ఖురేషీకి రూ.2 కోట్లు చెల్లించినట్లు ఈడీ తన చార్జిషీట్లో పేర్కొంది. ఇందుకోసం సతీష్‌తో కలిసి షబ్బీర్, బొత్స ఢిల్లీ వెళ్లారని వివరించినట్లుగా తెలుస్తోంది.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications