వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కి సూచన: గంటపాటు శంకరన్న మౌనం!(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీమంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఆందోళనలలో దివంగత ప్రధానులు, కాంగ్రెసు పార్టీ నేతలు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యుడు శంకర రావు శనివారం శాసన సభ ఆరవణలో మౌన దీక్ష చేపట్టారు.

మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో విగ్రహం వెనుక ఉన్న రోడ్డు పైన గంటకు పైగా కూర్చొని దీక్ష చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

నెహ్రూ, ఇందిరలను అవమానించడం తగదన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీ వల్లే పదవులు అనుభవించారని, కాంగ్రెసు నేతల విగ్రహాల ధ్వంసాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఖండించాలని సూచించారు. తెలంగాణను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి చెప్పడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమే అన్నారు.

శంకర రావు దీక్ష

శంకర రావు దీక్ష

మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యుడు శంకర రావు శనివారం అసెంబ్లీలోని మహాత్మా గాంధీ విగ్రహానికి వెనుక గంటకు పైగా మౌన దీక్ష చేపట్టారు.

మౌన దీక్ష కోసం

మౌన దీక్ష కోసం

మాజీ మంత్రి శంకర రావు మౌన దీక్ష చేసేందుకు వెళ్తున్న దృశ్యం. ఆయన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వెనుక మౌన దీక్షను చేపట్టారు.

విధ్వంసానికి వ్యతిరేకంగా

విధ్వంసానికి వ్యతిరేకంగా

సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల విధ్వంసాన్ని నిరసిస్తూ ఆయన దీక్ష చేపట్టారు.

విలేకర్లతో

విలేకర్లతో

మాజీ మంత్రి, కంటోన్మెంట్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు శంకర రావు మౌన దీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం.

English summary
Former Minister and MLA Shankar Rao make mouna deeksha at Assembly on Saturday for one hour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X