రాహుల్ గాంధీకి షాకిచ్చిన బ్రదర్ అనిల్...కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు నిరాకరణ..!
వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్టు ప్రకటించారు. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. తెలంగాణలో అధికారం కోసం సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించిన షర్మిల, అనుహ్యంగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి షాకిచ్చారు.
Recommended Video

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో.. ఆ పార్టీ అధిష్టానం ఇచ్చిన సూచనతో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. మల్లికార్జున ఖర్గే షర్మిలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.

అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా హాజరుకాకపోవడం సంచలనంగా మారింది. ఏపీ కాంగ్రెస్ నాయకులు మాత్రం షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. ఇదిలా ఉంటే షర్మిల భర్త కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ఇష్టపడలేదు.
రాహుల్ గాంధీకి షాకిచ్చిన బ్రదర్ అనిల్. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి నిరాకరించిన షర్మిల భర్త..!#YSSharmila #AnilKumar #RahulGandhi #MallikarjunKharge #Congress #YSRTelanganaParty #YSRTP #Telangana #Oneindiatelugu pic.twitter.com/57ZhaiQWYn
— oneindiatelugu (@oneindiatelugu) January 4, 2024
మొదట మల్లికార్జున ఖర్గే షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కు కండువా కప్పడానికి వెళ్లగా దాన్ని ఆయన నిరాకరించారు. ఆ తరువాత రాహుల్ గాంధీకి సైతం చేదు అనుభవమే ఎదురైంది. కేవలం షర్మిల మాత్రమే పార్టీలో చేరుతున్నారని చెప్పి బ్రదర్ అనిల్ కాంగ్రెస్ నాయకులకు గట్టి షాకే ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications