అమరావతిలో 'సింగపూర్' రీ ఎంట్రీ - కీలక బాధ్యతలు..!!
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ఘట్టం చోటు చేసుకుంటోంది. రాజధాని పనుల రీ లాంఛ్ కు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ నెలలోనే ఇందుకు ముహూర్తంగా నిర్ణయించారు. ఇదే సమయంలో కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలు పనుల ప్రారంభానికి సిద్దం అవుతున్నాయి. ఇటు సింగపూర్ రాజధాని నిర్మాణంలో భాగస్వామి కానుంది. ఈ మేరకు సింగపూర్ ప్రతినిధి బృందం రాజధానిలో పర్యటిస్తోంది. కోర్ క్యాపిటల్‌లో వివిధ నిర్మాణాలను బృందం పరిశీలిస్తోంది.
రాజధానిలో కీలక బాధ్యతలు నిర్వహణకు సిద్దమైంది.
పనులు ప్రారంభం
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. అమరావతి లో స్టార్టప్ ఏరియా నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోరుతోంది. ఈ మేరకు సింగపూర్ ప్రతినిధి బృందం రాజధానిలో పర్యటిస్తోంది. నిర్మాణాలను బృందం పరిశీలిస్తోంది. గతంలో రాజధాని అమరావతిలో సింగపూర్ స్టార్ట్అప్ ఏరియా డెవలప్ చేయడానికి సింగపూర్ కన్సార్టియం 1900 ఎకరాల భూమిని తీసుకుంది. 2015 లో అమరావతి రాజధాని గా నిర్ణయం తరువాత మాస్టర్ ప్లాన్ ఖరారులో సింగపూర్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో మరోసారి సింగపూర్ టీం అమరావతికి రావటం ఆసక్తి కరంగా మారుతోంది.

సింగపూర్ టీం రాక
అయిదేళ్లు కాలంలో అమరావతిలో మారిన పరిస్థితులు, ఫ్లడ్ కంట్రోల్‌కు తీసుకుంటున్న చర్ యలు, కరకట్ట రోడ్డు, ఉద్దండరాయుని పాలెం - తాళ్లాయపాలెంలోని స్టార్ట్ అప్ ఏరియా, ఐఏఎస్ అధికారుల టవర్స్, మంత్రుల నివాస సముదాయాలను సింగపూర్ ప్రతినిధి బృందం పరిశీలన చేసింది. ఉండవల్లి సమీపంలోని వరద నియంత్రణ కోసం నిర్మించిన ఫ్లడ్ పంపింగ్ స్టేషన్‌తో పాటు కృష్ణా కరకట్ట రోడ్డు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సంబంధించిన పనుల్ని సింగపూర్ ప్రతినిధులు చూశారు. మరోవైపు రాజధానిలోని ఉద్దండరాయునిపాలెం సమీపంలో సీడ్ యాక్సెస్ రహదారిని ఆనుకుని నిర్మించబోయే స్టార్టప్ ఏరియాను కూడా పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధిం చిన వివరాలను సీఆర్డీఏ అధికారులు సింగపూర్ బృందానికి వివరించారు.
సీడ్ క్యాపిటల్ లో
సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న దృష్ట్యా ఆ దేశ ప్రతినిధుల బృందం స్థానికంగా పర్యటించింది. రాజధానిలో పర్యటన అనంతరం సీఎస్ విజయానంద్‌తో సింగపూర్ ప్రతినిధుల బృందం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సీఆర్డిఏ, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి గతంలోలానే సింగపూర్ ప్రభుత్వం రాష్ట్రానికి సహాయ సహకారాలను అందించాలని విజ్ణప్తి చేశారు. ఈ నెల మూడో వారంలో ప్రధాని మోదీ అమరావతి పనుల రీ లాంఛ్ కు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో, నిర్మాణ పనులు వేగం పెరగనుంది. 2027 నాటికి తొలి దశ నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.












Click it and Unblock the Notifications