బుడబుక్కల వేషంలో శివ: సోనియాకు దోషమని జోస్యం

సోనియాకు, రాహుల్‌లకు దోషముందని తాను ముందే చెప్పానని, ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఏమయిందో చూడాలన్నారు. ఆమెను ఇటలీకి తరిమేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటే బాగుపడతారన్నారు. దోషం కారణంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీలో కాంగ్రెసు పార్టీ పోయిందన్నారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసైనా కాంగ్రెసు పార్టీ విభజనపై తన మనసును మార్చుకోవాలని ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందేనన్నారు.
మరోవైపు, హైదరాబాదులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సమైక్యాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం, మంత్రులు శైలజానాథ్ తదితరులు కలిశారు. డిసెంబర్ 9వ తేదీని విద్రోహ దినంగా పాటించేందుకు అశోక్ బాబు ఎవరని టిపిఎఫ్ ప్రశ్నించింది. టిపిఎఫ్ కార్యకర్తలు ఎపిఎన్జీవో హోంను ముట్టడించారు. డిసెంబర్ 9ని విద్రోహ దినంగా పాటించి ఎపిఎన్జీవో, సమైక్యవాదులు నిరసన తెలుపతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications