బాబు చెప్పకపోవచ్చు:శివప్రసాద్, సోమిరెడ్డి శాపనార్థాలు

సీమాంధ్ర ప్రజలు ఎవరు నిరాశకు లోను కావొద్దన్నారు. పార్లమెంటుకు ఎట్టి పరిస్థితుల్లో తాము బిల్లు రానివ్వమని చెప్పారు. సమైక్యాంధ్రను నిలుపుతామని చెప్పారు. శ్రీకృష్ణ తులాభారంలోని సంఘటనను ప్రస్తావిస్తూ.. తాము తులసిదళం వంటి పోరాటం చేస్తున్నామని, తమ పోరాటమే గెలుస్తుందన్నారు. విభజన ఉద్యమంలో సోనియా సత్యభామ లాంటివారైతే, టిడిపి తులసీదళమన్నారు.
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ వల్లనే విభజన జరుగుతోందని నిందలేసి తప్పించుకోవద్దన్నారు. తాము లేఖను ఉపసంహరించుకుంటే విభజను ఆపేస్తామని చెబితే చంద్రబాబును ఒప్పించి తాము ఉపసంహరించుకుంటామన్నారు. తమ సవాల్‌ను స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. తాము సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నామన్నారు. తమ పైన నిందలు వేయవద్దన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని తాము మొదటి నుండి చెబుతున్నామన్నారు. తెలంగాణపై తమ స్టాండ్ స్పష్టంగా ఉందని చెప్పారు. సీమాంధ్రకు న్యాయం చేయాలన్నారు.
విభజనను అడ్డుకునేందుకు జాతీయ పార్టీ నేతలను కలుస్తామన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తాము కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టి కూలదోస్తామన్నారు. కాగా అంతకుముందు టిడిపి ఎంపీలు పార్లమెంటు ద్వారం వద్ద ధర్నా చేశారు.
సోమిరెడ్డి శాపనార్థాలు
విభజనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, దివంగత వైయస్ కారకులని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. జగన్ యూపిఏకు మద్దతి ఇస్తారనే కాంగ్రెసు ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తెలుగు ప్రజల పాపం ఊరికేపోదని, కాంగ్రెసు పార్టీ మట్టికొట్టుకుపోతుందని శాపనార్థాలు పెట్టారు. సుప్రీం కోర్టులో విభజనకు అడ్డుకట్ట బడుతుందనే నమ్మకముందన్నారు.
భజనకు అనుకూలంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నా, విభజన ఏకపక్షంగా జరుగుతున్నా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయడంలేదని గాలి ముద్దుకృష్ణమ నాయుడు వేరుగా అన్నారు. అసెంబ్లీకి బిల్లు వస్తే తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు. ఎస్సెమ్మెస్‌లతో రాష్ట్రాన్ని విభజిస్తున్నారన్నారు. కాంగ్రెసును రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన తెలుగు జాతిని చీల్చాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications