కడపలో బిజెపి నేతపై రాళ్ల దాడి: తీవ్రగాయాలు
కడప: నగరంలోని రాజీవ్ పార్కు సమీపంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు బండి ప్రభాకర్‌పై శనివారం ఉదయం కొందరు దుండగులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయన్ని స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
పార్క్ దగ్గర నుంచి బైక్‌పై ఇంటికి వెళ్లేందుకు ప్రభాకర్ సిద్ధమవుతున్న సమయంలో సుమారు 20 మంది దుండగులు వచ్చి రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ప్రభాకర్ తలకు తీవ్రమైంది. ప్రస్తుతం ఆయన కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మాజీ ఎంపి తనయుడి కారు ఢీకొని ముగ్గురికి గాయాలు

తూర్పుగోదావరి: మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు అజాగ్రత్తగా కారు నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మండలం కోలమూరులో శనివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో ముగ్గురిక తీవ్ర గాయాలయ్యాయి.
మాజీ ఎంపీ తనయుడు సుందర్ శనివారం అర్థరాత్రి కారులో వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టటంతో మహేష్, చంటి, మనోజ్ అనే స్థానిక యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. హర్షకుమార్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications