ఆ రాత్రి సోనియాకి విజయమ్మ ఫోన్: జగన్‌పై సోమిరెడ్డి

మాజీ మంత్రిలు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిలు తాము కేసు నుండి బయటపడతామని విలేకరులతో చెప్పినందుకు సాక్ష్యులను ప్రభావితం చేస్తారని, వారిని తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ గతంలో కోరిందని, ఇప్పుడు జగన్‌కు అంత భద్రత మధ్య ర్యాలీకి అనుమతిస్తే సాక్ష్యులు ఆయనను చూసి భయపడరా అని ప్రశ్నించారు. జగన్‌కు ఘన స్వాగతం ఎలా పలుకుతారన్నారు.
మెమో వేయాలని సిబిఐకి ఎవరు చెప్పారన్నారు. ఆర్థిక నేరస్థుడికి రెడ్ కార్పెట్ దారుణమన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వంటి అసమర్థుడిని ప్రధానిని చేసేందుకు ఎపిని అల్లకల్లోలం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో రెండుసార్లు ప్రధాని పదవి తీసుకునే అవకాశమున్న రాహుల్ భయపడ్డారన్నారు. రెండుసార్లు పెళ్లి వద్దన్న వాడిని మూడోసారి కూడా ఒప్పించేందుకు ప్రయత్నించడమేమిటన్నారు. ఆయనకు నిజ జీవితంలో, రాజకీయ జీవితంలో పెళ్లి వద్దని ఎద్దేవా చేశారు.
గత నెల 23వ తేదిన సోనియా గాంధీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారని, మీరు గుండెలపై చెయ్యి వేసుకొని నిశ్చింతంగా ఉండాలని చెప్పారని సోనియా ఆమెకు చెప్పారని ఆరోపించారు. నేర చరితులు ఎక్కడున్నా వారిని కలుపుకొని రాహుల్‌ను ప్రధానిని చేయాలని కాంగ్రెసు చూస్తోందన్నారు. జగన్ ఆస్తులు, ఎమ్మార్, ఓఎంసి కేసులు అన్ని జగన్ చుట్టూనే తిరిగాయన్నారు.
ఓ వ్యక్తి వేల కోట్లు ఎలా సంపాదిస్తారని హైకోర్టు, సుప్రీం కోర్టు ప్రశ్నించిందని, ఇది సిబిఐకి గుర్తు లేదా అన్నారు. సోనియాకు కడప పౌరుషం చూపిస్తామన్న వారు ఇప్పుడు కాళ్లు పట్టుకున్నారని ధ్వజమెత్తారు. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాడు నేడు జగన్‌ను పొగుడుతున్నారని, ముగ్గురు స్వార్థపరులు ఒక్కటయ్యారన్నారు. కాంగ్రెసుకు అధికారు, కెసిఆర్‌కు కుటుంబం సంపాదించుకోవడం, జగన్‌కు అధికారు, ఆస్తులు కాపాడుకోవడమే కావాలన్నారు.
తెలుగుదేశం పార్టీకి ఓ చరిత్ర ఉందని, నీతి - నిజాయితీ తమకు ముఖ్యమన్నారు. ఎవరు కావాలో ప్రజలు చెబుతారన్నారు. జగన్ కరడుగట్టిన నేరస్థుడిని అతనికి మరొకరితో పోలిక లేదన్నారు. లంచం ఇచ్చిన వాళ్లు జైళ్లలో, తీసుకున్న వాళ్లు బయట ఉన్నారని మండిపడ్డారు. సమైక్య ఉద్యమానికి జగన్ నాయకత్వం వహిస్తే చెడ్డపేరు వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications