జగన్, కెసిఆర్‌ను ఏకేసిన సోమిరెడ్డి, టి హీరోలకి అండగా

Somireddy speech in Mahanadu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం మహానాడులో మాట్లాడారు. తన ప్రసంగంలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెరాస అధ్యక్షులు, కాబోయే తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నిప్పులు చెరిగారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే ఓ కెరటం.. శక్తి.. ప్రభంజనం.. భీముడు.. రాముడు.. కృష్ణుడు అంటూ కొనియాడారు. ఆయన సినిమాల్లోనే హీరో మాత్రమే కాకుండా నిజ జీవితంలోను ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఇలా కూడా చేయవచ్చునని దేశానికి సూచించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.

కొన్ని కుటుంబాలకే రాజకీయాలు పరిమితమైన సమయంలో అందరిలో రాజకీయ చైతన్యం కల్పించారన్నారు. చంద్రబాబుకు నిజమైన రాజకీయ వారసుడు చంద్రబాబు అన్నారు. కాంగ్రెసు పార్టీ గుండెల్లో ఎన్టీఆర్, చంద్రబాబులు నిద్రపోయారన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చినందుకు స్వరంలో ఉన్న ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందన్నారు.

ప్రజల కోసం ఈ వయస్సులో చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్ర చేయడం ప్రపంచంలోనే గొప్ప అన్నారు. ఉప ఎన్నికల్లో సెంటిమెంటు, కోట్లాది రూపాయలతో టిడిపి అంతు చూడాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుకుందని, అలాంటి స్థితిలో నాయకులు, కార్యకర్తల్లో చంద్రబాబు ఉత్సాహం నింపారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అరాచక శక్తుల చేతిల్లోకి కొత్త రాష్ట్రం పోకుండా కాపాడారన్నారు.

తెరాస అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇస్తామని కెసిఆర్ చెప్పారని, ఇప్పుడు వారి గొంతు కోశారన్నారు. ఆయన పదవి చేపట్టాక దళితులను ఇబ్బందులు పెడితే తాము చూస్తూ ఊరుకోమన్నారు. ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమన్నారు.

కెసిఆర్‌లా దళితులను పచ్చి మోసం, దగా చేసిన వ్యక్తిని చూడలేదన్నారు. తెలంగాణలో గెలిచిన, ఓడిన టిడిపి నేతలు, అండగా నిలబడ్డ కార్యకర్తలు హీరోలే అన్నారు. ఆ హీరోలకు తాము నిత్యం అండగా ఉంటామని చెప్పారు. కెసిఆర్ వంటి మోసగాడి చేతిలో నుండి తెలంగాణను కాపాడే వరకు, టిడిపిని తెలంగాణలో అధికారంలోకి తెచ్చే వరకు తాము అండగా ఉంటామని, తెలంగాణ టిడిపి ధైర్యంగా పోరాడాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+