టీడీపీతో పొత్తుందని ఎవరు చెప్పారు ? సోము వీర్రాజు ప్రశ్న- రాజకీయ శూన్యత ఉందని వెల్లడి..
ఏపీలో చంద్రబాబుతో కలిసి బీజేపీ పొత్తుతో వెళుతుందని ఎవరు చెప్పారని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇరు పార్టీల నుంచి ప్రకటన రాకుండా జరిగే ప్రచారాలకు తామెలా సమాధానం చెబుతామన్నారు. అమిత్ షా తో చంద్రబాబు కలిసినంత మాత్రాన ఎవరిష్టం వచ్చిన్నట్లు వారు ఊహించుకుంటే తామేం చెబుతామన్నారు. తమ పార్టీ పెద్ద లతో సమావేశం అయ్యాక చంద్రబాబు ఎక్కడా ఆ అంశంపై మాట్లాడలేదన్నారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై తమ పార్టీ జాతీయ నేతలు విమర్శలు చేశారని, ఈ పరిణామాలను ఎలా అయినా ఎవరికి వారు అన్వయించుకోవచ్చన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అడగడం మీ ధర్మం, చెప్పడం నా ధర్మం అంటూ మీడియాను ఉద్దేశించి సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రానికి డబుల్ ఇంజన్ సర్కార్ కావాలనేది తన ఆకాంక్ష అన్నారు. మోడీ చేసిన అభివృద్ది, సంక్షేమం అందరికీ కనిపిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. చూపాలని అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ సంక్షేమం మాత్రమే అమలు అవుతోందన్నారు.

రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని, బీజేపీకి అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సోము వీర్రాజు తెలిపారు. అన్ని జిల్లాల్లో బీజేపీ బహిరంగ సభలు విజయవంతం అయ్యాయని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ళ పాలనలో సేవ, సుపరిపాలన, సంక్షేమం అంశాలను వివిధ కార్యక్రమాల రూపంలో ప్రజల్లోకి తీసుకెళుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 30నుంచి ఇవాళ్టి వరకు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకు వెళ్లామన్నారు.
మోడీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని సోము తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై మాత్రం చాలా చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైందన్నారు. మోడీ ఆదరణ ప్రజల్లో ఉన్నట్లు బీజేపీ స్పష్టంగా గుర్తించిందన్నారు. ఇరవై బహిరంగ సభలను ఇరవై జిల్లాల్లో పెట్టామని, ఒంగోలు, చిత్తూరు, నంద్యాలలో కూడా బహిరంగ సభలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 26చోట్ల మేధావులు,వ్యాపారులు, వివిధ వర్గాలతో ఇష్టాగోష్టి నిర్వహించామన్నారు.
రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయాన్ని వివరిస్తూ పుస్తకాలు, కరపత్రాలను పంపిణీ చేశామన్నారు.
రాష్ట్రంలో గాలి మారుతోందని, కమలం వికసిస్తుందని సోము వీర్రాజు తెలిపారు. నిజాన్ని గుప్పిట్లో పెట్టి ఎంతోకాలం ఆపలేరనేది తెలుసుకోవాలన్నారు. ప్రజల్లోకి వెళ్లిన సమయంలో వారి ద్వారా నిజాన్ని దాస్తున్నారని అర్దమైందన్నారు. నరేంద్ర మోడీ ఇచ్చే నిధులతో పధకాలను అమలు చేస్తూ, సొంత పధకాలుగా వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. జలజీవన్ మిషన్ అని చెప్పకుండా పధకాన్ని ప్రచారం చేసుకోవడంపై కేంద్రమంత్రులు నిలదీసిన సందర్భాలు ఉన్నాయన్నారు.

సెంటు స్థలం లో నిర్మాణం కేంద్రం లక్షా ఇరవై వేలు ఇస్తుందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకం వల్ల నేటికీ ఆ ఇళ్లు కట్టని పరిస్థితి ఉందని సోము ఆరోపించారు. పేదల కోసం బియ్యం ఇస్తే వాటిని కొనుగోలు చేసి పోర్టు ద్వారా ఎగుమతి చేసుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 75శాతం మంది లబ్దిదారులు మోడీ పధకాలు అందుకుంటున్నారని, జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల వారీగా సభలు పెట్టి ప్రజలకు వివరిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు కేంద్రం నిధులను మళ్లించి తమవిగా చెప్పుకున్నాయని సోము తెలిపారు. భవిష్యత్ లో కేంద్ర పధకాలపై మరింత విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. కేంద్రంలో మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమన్నారు.
ఏపీలో కూడా బీజేపీ కమలం వికసిస్తుందనే విశ్వాసం ఉందన్నారు. తాము ఎక్కడకి వెళ్లినా ప్రజలు తమ కష్టాలు చెప్పుకుని కన్నీళ్లు పెడుతున్నారని, అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గు చేటన్నారు. ఏ అంశంలో తాము అద్భుతంగా చేశామని చెప్పుకోవడానికి వారికి ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు.
కేంద్ర పథకాలకు డబ్ చేసి వారి పేర్లు పెట్టుకోవడమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని సోము వీర్రాజు తెలిపారు. ఏపీలో డబ్బింగ్ సినిమా నడుస్తోందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ కోసం పని చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్, ముద్రగడ ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారని, ప్రజా జీవితంలో ఉన్నారని గుర్తుచేశారు. కుటుంబ పాలకులు చేసే అసత్యాలను తిప్పికొట్టి, ప్రజలకు వాస్తవాలు చెబుతామన్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications