తిరుమలకు పవన్ కల్యాణ్, తిరుపతిలో పోలీసులు అలర్ట్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుమల పర్యటన సందర్భంగా తిరుపతిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ఆరోపణలు రావడంతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించాలని పవన్ కల్యాణ్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు.

దీక్ష విరమించడానికి పవన్ కల్యాణ్ తిరుమలకు బయలుదేరుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన అలిపిరికి పవన్ కల్యాణ్ చేరుకుంటారు. అలిపిరి మెట్ల మార్గంలోని మొదటి మెట్టు దగ్గర ప్రత్యేక పూజలు చేసి ముక్కులు తీర్చుకుంటున్న పవన్ కల్యాణ్ ఆ తర్వాత మెట్ల మార్గంలో కాలినడకన తిరుమల చేరుకుంటున్నారు.

Special arrangements in Tirupati on the occasion of Deputy Chief Minister Pawan Kalyan s visit

మంగళవారం రాత్రి తిరుమలలోని విశ్రాంతి భవనంలో బస చేయనున్న పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరిగొండ శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించనున్నారు. పవన్ కల్యాణ్ తిరుమల పర్యటన సందర్భంగా టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. తిరుమలలో దీక్ష విరమించిన తర్వాత పవన్ కల్యాణ్ తిరుపతి చేరుకుంటారు.

బుధవారం సాయంత్రం తిరుపతిలో తలపెట్టిన వారాహి సభలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారో ? అనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తిరుపతి శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆరోపణలు వస్తున్న సమయంలో దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తిరుపతిలో జరుగుతున్న వారాహి సభలో ఏం మాట్లాడుతారు అనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Special arrangements in Tirupati on the occasion of Deputy Chief Minister Pawan Kalyan s visit

డీసీఎం పవన్ కల్యాణ్ పర్యటనపై తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఇప్పటికే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. గురువారం సాయంత్రం జరగబోయే పవన్ కల్యాణ్ వారాహి సభకు పలు ప్రాంతాల్లో పరిశీలించిన జనసేన నాయకులు చివరికి చివరికి జ్యోతిరావు పూలే సర్కిల్ లో వారాహి సభ నిర్వహించాలని నిర్ణయించారు. అన్నమయ్య సర్కిల్, లీలామహల్ సర్కిల్, జ్యోతిరావు పూలే సర్కిల్ లో ఎక్కడ సభ నిర్వహిస్తే బాగుంటుందని తిరుపతి జనసేన నాయకులు పరిశీలించారు.

ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఉద్దేశంతో జ్యోతిరావు పూలే సర్కిల్లో పవన్ కల్యాణ్ వారాహి సభ నిర్వహించాలని జనసేన నాయకులు నిర్వహించారు. పవన్ కల్యాణ్ పర్యటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో వైసీపీ ఎంపీ ఉన్నారు. ఇప్పటికే తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి పవన్ కల్యాణ్ వారాహి సభ విషయంలో విమర్శిచడం జరిగింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటనలో ఎలా స్పందిస్తారు, గత టీటీడీ పాలకమండలి విషయంలో జనసేన అధినేత ఏం మాట్లాడుతారు అంటూ అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+