దసరా సెలవుల్లో ఆధార్ అప్‌డేట్ కి మరో ఛాన్స్- ప్రత్యేక శిబిరాలు, ఇలా చేయండి..!!
ఆధార్ నమోదు... ఆప్డేట్ కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా దసరా సెలవుల్లో విద్యార్ధుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని డిసైడ్ అయింది. ఈ నెల 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని ద్వారా వర్కింగ్ డేస్ లో ఆధార్ నమోదు కోసం కేంద్రాలకు రాలేకపోతున్న వారికి వెసులుబాటు కలగనుంది. సచివాలయాల ద్వారా ఈ అవకాశం కల్పించటంతో.. విద్యార్ధులు సద్వినియోగం చేసుకునే అవకాశం ఏర్పడింది.
ఏపీలో ఆధార్ నమోదు, నవీకరణ పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులను వినియోగించుకుని ఆధార్ నమోదు, సవరణ కోసం ప్రత్యేక శిబి రాలు నిర్వహించనుంది. ఈ నెల 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టరేట్‌కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆర్డీవోలు, డీఎల్‌డీవోలు పర్యవేక్షణలో ఈ శిబిరాలు జరగాలని నిర్దేశించి న ప్రభుత్వం..నూరుశాతం ఆధార్ నమోదు, నవీకరణ పూర్తి చేయడం లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేసింది. దీని ద్వారా ఆధార్ కార్డులు లేని వారు.. అప్డేట్ చేసుకోవాల్సి ఉన్నవారికి వెసులుబాటు కలగనుంది.

విద్యార్ధుల కోసం ఈ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. దసరా సెలవుల్లో విద్యార్థులకు పాఠశాలల నుంచి విరామం ఉండటంతో, వారికి ఇబ్బంది లేకుండా ఆధార్ నమోదు, సవరణ చేసుకునే అవకాశం కల్పించాలన్న ఆలోచనతో ఈ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఆధార్ నమోదు, నవీకరణ కోసం ఎంపిక చేసిన సచివాలయాల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ వినియోగం, బయోమెట్రిక్ విధానం, ఫొటో, పత్రాల స్కానింగ్ వంటి అంశాల్లో వారికి అవగాహన కల్పించారు. అయితే, ఇటీవల కొందరు శిక్షణ పొందిన సిబ్బంది బదిలీ కావడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడిందని అధికారులు గుర్తించారు. దీనిపై సర్దుబాటు చర్యలు చేపడుతూ, నాలుగు రోజులపాటు ఎలాంటి అంతరాయం లేకుండా శిబిరాలు కొనసాగించేలా ప్రణాళికలు సిద్దం చేసారు.












Click it and Unblock the Notifications