ఇదే మన రాజధాని, ఇక్కడే ఉంటాం: బాబు(పిక్చర్స్)

విజయవాడ: ఇదే మన రాజధాని అని, మనం ఇక్కడే ఉంటామని, రానున్న రోజుల్లో మన ఊరు అనుకుని ఇక్కడ పని చేయాల్సి ఉంటుందని, గతంలో నేను మీకు ఏ విషయాన్ని అయినా నొక్కి చెప్పేవాడినని, ఇప్పుడు చెప్పి చేస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

మనం మరింత కష్టపడాల్సిన సమయం వచ్చిందని, ఇబ్బందుల మధ్యనే ఏడాది పూర్తి చేసుకున్నామని, చాలా వరకు ప్రజలకు న్యాయం చేశామని, మిగిలిన నాలుగేళ్లలో ప్రజల కోసం, రాజధాని నిర్మాణం కోసం మరింత కష్టపడాలన,ి మీ నుంచి ఆ సహకారం ఆశిస్తున్నానని చెప్పారు.

దీక్ష అనంతరం ప్రభుత్వ అతిథి గృహంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నవ నిర్మాణ దీక్ష సమైక్యాంధ్ర సభల తరహాలోనే విజయవంతమైందని, మీరు స్ఫూర్తిమంతంగా మాట్లాడారంటూ అధికారులు చంద్రబాబును కొనియాడారు.

చంద్రబాబు

చంద్రబాబు

నవ నిర్మాణ దీక్ష విజయవంతం కావడంపై తనకు కూడా ఆనందంగా ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఇబ్బందుల్లో ఉన్నా రాజధాని నిర్మాణంతోపాటు రాష్ర్టాభివృద్ధి, ప్రజా సంక్షేమాలను ఏకకాలంలో నిర్వహించటానికి సర్వ శక్తులు ఒడ్డామని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

మనమంతా మిగిలిన నాలుగేళ్లూ శక్తికి మించి పనిచే యాల్సి ఉంటుందని చెప్పారు. విద్యుత్తు శాఖాధికారులు మరింత కష్టపడాలని, పరిశ్రమలు, విద్యుత్తు శాఖలు రెండూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

రాష్ర్టాభివృద్ధికి పవర్‌, పరిశ్రమలే అతి ముఖ్యమైనవని, ఆ రెండూ సమన్వయంతో పని చేస్తేనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు

 చంద్రబాబు

చంద్రబాబు

నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణమే తెలుగుదేశం ప్రభుత్వం ధ్యేయమని విజయవాడ బెంజ్‌సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

విభజించిన వారు అసూయ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

పేదల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రాలు విడిపోయినా తెలుగువారంతా ఒక్కటేనని, అభివృద్ధికి రెండు రాష్ట్రాలు సహకరించుకోవాలన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

నవ్యాంధ్ర నిర్మాణానికి కృషి చేస్తామని ఉద్యోగులు, ప్రజలతో ఏపీ సీఎం నారా చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. ఏపీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరావు, కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్‌, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ఏపీ సచివాలయ ఉద్యగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన రైతులకు, రాజధానిలో జరీబు భూములకు వర్తింపజేసిన ప్యాకేజీ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు. ఈ విషయమై వెంటనే కృష్ణా జిల్లా కలెక్టర్‌కు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు


మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో ఆధునీకరించిన లాంజ్‌ను ప్రారంభించిన అనంతరం చంద్రబాబుతో భారత ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు సమావేశమయ్యారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూసేకరణ అంశం వారి మధ్య చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా రైతుల సమస్యలు ప్రస్తావించారు.

చంద్రబాబు

చంద్రబాబు

విమానాశ్రయం విస్తరణ కోసం గన్నవరం మండలంలోని బుద్దవరం, అజ్జంపూడి, దావాజిగూడెం, కేసరపల్లి గ్రామాల్లో కలిపి 460 ఎకరాలను సేకరించాల్సి ఉంది.

చంద్రబాబు

చంద్రబాబు

విమానాశ్రయం పక్కనే ఉన్న ఈ గ్రామాల్లో భూముల ధరలు మొదటి నుంచీ ఎక్కువగా ఉన్నాయని, అందువల్లే రైతులు ఎక్కువ ప్యాకేజీ అడుగుతున్నారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఇతరులు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

దీంతో, జరీబు గ్రామాల రైతులకు ఇచ్చిన ప్యాకేజీ ఇస్తే అందరూ భూములిచ్చేందుకు ముందుకు వస్తారని తెలిపారు. దీంతో ఈ గ్రామాల రైతులకు కూడా రాజధానిలో జరీబు గ్రామాల రైతులకు ఇచ్చిన 1450 గజాల ప్యాకేజీ ఇవ్వాలని కలెక్టర్‌ను చంద్రబాబు ఆదేశించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

అంటే వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం ఇవ్వనున్నారు. పోలవరం కుడికాలువ కోసం భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలను మంత్రి దేవినేని ఉమ, రైతులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళారు.

చంద్రబాబు

చంద్రబాబు

దీంతో, భూసేకరణ విషయంలో కూడా తక్షణమే నిధులు విడుదల చేయాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణం ఉన్నాయన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

గోదావరి పుష్కరాలకు రాజమండ్రి ఎయిర్‌ పోర్ట్‌ను, కృష్ణా పుష్కరాలకు రూ.108 కోట్లతో గన్నవరం ఎయిర్ పోర్ట్‌ విస్తరణ పనులు పూర్తి చేస్తామన్నారు. నవ నిర్మాణ దీక్ష చేసిన రోజే గన్నవరం టెర్మినల్‌ ప్రారంభించటం సంతోషంగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు.

చంద్రబాబు

చంద్రబాబు

కేవలం రెండు నెలల 25 రోజుల్లోనే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ టెంపరరీ టెర్మినల్‌ను రూ.2.96 కోట్లతో నిర్మించామని తెలిపారు. రాష్ట్రంలోని పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైల్వేలు, రహదారులను కలుపుతూ కనెక్టివిటీ పెంచే విధంగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+