మూడు రాష్ట్రాల్లో పెద్దిరెడ్డి అనుచుడి కోసం వేట, ఆర్డీఓలు తెలీదు అనే సినిమా డైలాగులు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం కేసు దర్యాప్తును అన్ని కోణాల్లో వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాదవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మాదవ రెడ్డి బెంగళూరు లేదా చెన్నై పారిపోయి ఉంటాడని కొందరు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మాదవ రెడ్డి అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చిత్తూరు జిల్లాలోనే రహస్య ప్రాంతంలో తలదాచుకుని ఉంటాడని కొందరు పోలీసులు అంటున్నారు.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిన తరువాత కేసు అనేక మలుపులుతిరుగుతోంది. మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరులు కొందరు భూదందాలకు పాల్పడ్డారని ప్రజలు అదికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఇలా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల మీద ఫిర్యాదు చేసిన వారిలో తిరుపతి రిటైడ్ ఎస్ చౌలేశ్వరయ్య ఉండటంతో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసు అధికారుల భూములు కూడా పెద్దిరెడ్డి మనుషులు వదల్లేదని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన సొంత సోదరుడు, తంబళ్లపల్లె వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి అనుచురులు చేసిన భూ కబ్జాలను వెలికితీయాలని ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ ప్రభుత్వం సిద్దం అయ్యింది. ఇదే సమయంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్న గౌతమ్ తేజ్ మొదట తనకు ఏమీ తెలీదు అని సినిమా డైలాగ్ లు కొట్టాడని, తరువాత పోలీసులు పూజ చేస్తే తరువాత గౌతమ్ నోరు విప్పడం మొదలుపెట్టాడని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు. గౌతమ్ తేజ్ తో పాటు మదనపల్లె ఆర్డీఓ హరిప్రసాద్, తిరుపతి ఆర్డీఓ మురళిని పోలీసులు ఐదవ రోజు విచారణ చేసి వివరాలు బయటకులాగారు.

పలమనేరులో సొంత పనిమీద ఉన్న గౌతమ్ తేజ్ కు ఫోన్ చేసిన ఆర్డీఓ హరిప్రసాద్ అతన్ని మదనపల్లెకు పిలిపించారని, తరువాత ఆదివారం ఉాదయం నుంచి రాత్రి వరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇద్దరూ కలిసి ఫైళ్లు పరిశీలించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఆదివార రాత్రి సబ్ కలెక్టర్ ఆఫీసు పక్కనే ఉన్న ఇంటికి హరిప్రసాద్ వెళ్లిపోయారని, రాత్రి 10.30 గంటల తరువాత గౌతమ్ తేజ్ సబ్ కలెక్టర్ ఆఫీసు నుంచి బయటకు వెళ్లిపోయిన తరువాత మంటలు వ్యాపించాయని, తరువాత వాచ్ మెన్ పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారని పోలీసు అధికారులు అంటున్నారు.
ఆర్డీఓలు హరిప్రసాద్, మురళితో పాటు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న 35 మందిని విచారణ చేసి వివరాలు సేకరించిన పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు వీలైనంత త్వరగా కేసు దర్యాప్తు ఓ కొలిక్కి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం కేసులో కొందరు అరెస్టు అవుతారని, కొందరు సస్పెండ్ అవుతారని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పీ సిసోదియా ఓ క్లూ ఇచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications