జగన్ అరెస్ట్ కు 'అక్కడే బ్రేక్' - ఊహించని రాజకీయం..!?

ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతోంది. ఇటు వైసీపీ నేతల పైన వరుస కేసులు నమోదు అవుతున్నాయి. లిక్కర్ కేసులో వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. జగన్ సైతం ఈ కేసులో అరెస్ట్ ఖాయం అంటూ పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. జగన్ ఈ అరెస్ట్ వార్తలపైన స్పందించారు. తాను విజయవాడలోనే ఉన్నానని.. ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. అయితే, జగన్ అరెస్ట్ సాధ్యమేనా.. ఏం జరుగుతోంది.

జగన్ అరెస్ట్ పై
లిక్కర్ కేసు ఏపీలో సంచలనంగా మారుతోంది. సిట్ విచారణ లో భాగంగా జగన్ సన్నిహితులు పలువురు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో అన్నీ తామై వ్యవహరించి న మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ తో ఈ కేసు కీలక మలుపు తీసు కుంది. ఇదే సమయంలో ఈడీ ఈ కేసులో జోక్యం చేసుకోవటం మరో ఆసక్తి కర పరిణామం. ఇటు జగన్ అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం సాగుతోంది. తాజాగా మీడియా సమావేశంలో ఇదే అంశం పైన స్పందించిన జగన్ తాను విజయవాడలోనే ఉన్నానని.. ఎవరు అడ్డుకుంటున్నారని.. వెల్ కం అంటూ వ్యాఖ్యానించారు. అటు మంత్రివర్గ సమావేశ సమయంలో లిక్కర్ స్కాం పైన ఎవరూ మాట్లాడ వద్దని మంత్రులకు చంద్రబాబు నిర్దేశించారు.

speculations-are-on-ys-jagan-arrest-in-liquor-case-whats-going-on

విచారణలో కీలకంగా
లిక్కర్ కేసు విచారణ.. అరెస్ట్ లు పైన జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. లిక్కర్ కేసులో సీఎంఓ కు ఒక్క ఫైల్ వచ్చిందని.. ఒక్క సంతకం ఉందని చంద్రబాబు నిరూపించగలరా అంటూ సవాల్ చేసారు. ధనుంజయ రెడ్డి అసలు ఎక్సైజ్ వ్యవహారాలు పర్యవేక్షించలేదని జగన్ చెప్పుకొచ్చారు. కాగా, మరో వైపు లిక్కర్ కేసు విచారణలో భారీగా లావా దేవీలకు సంబంధించి ఆధారాలు దొరికి నట్లు కథనాలు ప్రచురితం అవుతున్నాయి. అయితే, జగన్ ప్రమేయం పైన ఎలాంటి ఆధారాలు ఉన్నాయనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. మద్యం వ్యవహారాల్లో తాను ఎక్కడా సంతకం చేయ లేదని చెబుతున్న జగన్.. పరోక్షంగా వస్తున్న ఆరోపణల్లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని సంకే తాలు ఇచ్చే ప్రయత్నం చేసారు. అయితే.. కేసులో ఇప్పటికే కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, వాసుదేవరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా జగన్ అరెస్ట్ కు సిద్ద పడతారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

రాజకీయ ప్రభావం
వారిచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా అరెస్ట్ చేస్తే.. న్యాయ స్థానాల్లో ఎంత మేర బలంగా నిలబడ తా యనేది కీలక అంశంగా మారుతోంది. ఏపీలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. జగన్ అరెస్ట్ వంటి అంశంలో మూడు పార్టీల అభిప్రాయం కూడా కీలకం కానుంది. జగన్ అరెస్ట్ ద్వారా రాజకీయంగా చోటు చేసుకునే పరిణామాల పైనా చర్చ జరుగుతోంది. బీజేపీ ముఖ్య నేతల తో ఈ అంశం పైన చర్చల వేళ.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం పైన ముందుకు వెళ్లాలని సూచించినట్లు ప్రచారం సాగుతోంది. రాజకీయంగా జగన్ కు ఏ చిన్న అవకాశం ఇవ్వ కూడనేది కూటమి ముఖ్యుల ఆలోచన. జగన్ ను అరెస్ట్ చేసినా.. బెయిల్ పైన బయటకు వచ్చిన తరువాత రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు.. ప్రజా స్పందన పైనా అంచనా వేస్తున్నారు. దీంతో, పూర్తి స్థాయి ఆధారాలు.. భవిష్యత్ పరిణామాల పైన ఒక స్పష్టతకు వచ్చిన తరువాతనే జగన్ అరెస్ట్ విషయంలో నిర్ణయం జరిగే అవకాశం ఉందని కూటమి నేతలు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+