వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధ్యాత్మిక వేత్త‌ల‌పై రాజ‌కీయ క్రీనీడ‌లు!!

|
Google Oneindia TeluguNews

భౌతిక జీవితాన్ని కాదునుకొని భ‌గ‌వంతుడి కోసం ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకొని త‌మ జీవిత‌కాల‌మంతా ఆ అంతర్యామి కోసం ధార‌పోస్తారు. అందుకే వారు గురువులుగా, స్వామీజీలుగా ప్ర‌జ‌ల‌చేత ఆరాధింప‌బ‌డుతున్నారు. ప్ర‌జ‌ల‌ను భక్తిమార్గంలోకి ప‌య‌నింప‌చేసి వారిని త‌రింప‌చేస్తారు. రాజ‌కీయ నాయ‌కుల జీవితాలు ఇందుకు విరుద్ధంగా ఉంటాయి. నిత్యం ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వ్వాలి. ల‌క్ష‌లాది మందికి ఎన్నో ప‌నులుంటాయి. వాటిని నెర‌వేరుస్తార‌నే న‌మ్మ‌కంతో నిత్యం వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు రాజ‌కీయ నేత‌ల‌ను క‌లుస్తుంటారు.

Recommended Video

50 లక్షల రైతు కుటుంబాలు... 23,875 కోట్ల ప్రయోజనం *Andhra Pradesh | Telugu OneIndia
హామీలు అమలు చేయాలంటే మోసం చేయక తప్పదు

హామీలు అమలు చేయాలంటే మోసం చేయక తప్పదు


ఎన్నిక‌ల్లో వారిని ఆక‌ట్టుకోవ‌డానికి హామీలు గుమ్మ‌రిస్తారు. అబ‌ద్దాలు ఆడ‌క త‌ప్ప‌దు. హామీలు అమ‌లు చేసే విష‌యంలో మోసాలు చేయ‌క త‌ప్ప‌దు. లేదంటే కోట్ల‌మంది ప్ర‌జ‌ల‌ను సంతుష్టుల‌ను చేయ‌డం క‌ష్టం. స్వకార్యం కూడా చూసుకోవాలి. అడుగు తీసి అడుగువేస్తే అధికార గ‌ణం ఉంటుంది. అనుచ‌ర గ‌ణం ఉంటుంది. కార్యాల‌యం నుంచి కాలు బ‌య‌ట‌పెడితే కారులోనే పెట్టాలి. కారులో నుంచి కాలు బ‌య‌ట‌కు పెట్టాలంటే ఎర్ర తివాచీల‌పై పెడ‌తారు. హంగు, ఆర్భాటంతో కూడి జీవితం రాజ‌కీయ నేత‌ల సొంతం.

డబ్బే పరమావధిగా ఉండాలి

డబ్బే పరమావధిగా ఉండాలి


నిత్యం హంగు, ఆర్భాట‌ల‌తో ఉంటూ డ‌బ్బే ప‌ర‌మావ‌ధిగా నైతిక విలువ‌ల‌ను వ‌దిలివేసి జీవించ‌డ‌మ‌నేది దుర్భ‌రంగా అనిపిస్తుంది. అటువంటి జీవితాల‌తో ఆధ్యాత్మిక వేత్త‌లు క‌ల‌వ‌లేరు. ప్ర‌స్తుతం భిన్న పార్శ్వాలున్న ఈ రెండూ క‌ల‌వ‌డ‌మే వైచిత్రి. ఇవి రెండూ విడ‌దీయ‌రాని క‌వ‌ల పిల్ల‌ల్లా మారిపోయాయంటే అతిశ‌యోక్తి కాదు. రాజ‌కీయాల్లో గెల‌వ‌డానికి నేత‌ల‌కు స్వాములు కావాలి.. వారి చేత గెలుపు కోసం య‌జ్ఞ యాగాదులు కావాలి.. వారి భ‌క్తుల ఓట్లు కావాలి.

 వారు చెప్పిందే వేదం..

వారు చెప్పిందే వేదం..


కాలం క‌లిసొచ్చిఈ యాగాల‌న్నీఫ‌లించి అధికారం చేప‌డితే స్వాములే అన‌ధికార రారాజులుగా చెలామ‌ణి అవుతున్నారు. వారు చెప్పిందే వేదంగా ఉంటుంది.. వారి అనుకున్న‌దే శాస‌నం అవుతోంది. ప్ర‌భుత్వంలో పనులు కావాలంటే తెలివిగ‌ల‌వారు వీరిని ఆశ్ర‌యించి త‌మ‌కు కావాల్సిన‌వాటివి సాధించుకుంటున్నారు. రాజ‌కీయ నేత‌లు వీరి మాట‌ను కాద‌న‌లేరు. దీంతో స్వాములు, గురువులు కూడా రాజ‌కీయ వైకుంఠ‌పాళిలో పాము, నిచ్చెన ఆట ఆడతున్నారు. సాధారణంగా ఆడుకునే ఆటలో ఏ ఇబ్బందులు ఉండవు. రాజకీయ వైకుంఠపాళిలో మాత్రం పాము నోటికి చిక్కడమేకానీ పైకెళ్లడానికి నిచ్చెనలు మాత్రం ఉండవు.

English summary
Lords and Gurus are also playing snake and ladder game in political Vaikunthapali.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X