Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమలలో మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు, గోవిందుడు అందరివాడు !

తిరుమల/తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల (tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam)ఐదో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు (TTD) అలంకృతుడై అభయమిచ్చారు.

ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో (tirumala) విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ (Brahmotsavam) కోలాహలంగా జరిగింది.

గరుడసేవకు భారీ బందోబస్తే, వేల సంఖ్యలో సీసీటీవీలు, 2 లక్షల మంది !

Sri Malayappa Swamy mesmerised the devotees in His Mohini Avatar in Tirumala

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని (TTD) దర్శించుకున్నారు.మోహినీ అవతారం (Brahmotsavam) వాహన సేవలకు ప్రత్యేకత ఉంది. మాయా మోహ నాశ‌నం అని కూడా అంటారు. ఈ అలంకారం (tirumala) ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు (Brahmotsavam) ఈ రూపంలో చాటి చెబుతున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ (TTD)ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. మోహిని వాహనంపై (Brahmotsavam) విహరిస్తున్న స్వామివారిని దర్శించుకోవడానికి మాడ వీధుల్లో వేలాది మంది భక్తులు శుక్రవారం ఉదయం నుంచి వెయ్యి కళ్లతో వేచి చూశారు. రాత్రి 7 గంటలకు విశేష‌మైన గరుడవాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు కటాక్షిస్తారు.

Sri Malayappa Swamy mesmerised the devotees in His Mohini Avatar in Tirumala

శ్రీవారి (TTD) సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) ఐదో రోజైన శుక్ర‌వారం ఉద‌యం ప‌ల్ల‌కీ ఉత్స‌వంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలు ఇచ్చాయి.చెన్నై నుండి వచ్చిన క‌ళాకారులు గురువాయూరప్ప‌న్ అనే నృత్యకళ‌లో శ్రీకృష్ణలీలలను చక్కగా ఆవిష్కరించారు.గుజరాతీ (tirumala) ప్రాచీన జానపద కళారూపం గ‌ర్భ. కళ్యాణం అనంతరం దంపతులతో క‌లిసి చేసే ఆనందతాండవ క‌ళారూపం ఇది. దీన్ని సుమన బృందం అత్యంత మనోహరంగా ప్రదర్శించింది.

యం.జీ.కటేకర్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర నుండి వచ్చిన డ్రమ్స్ వీనుల‌విందుగా సాగింది. మధ్యప్రదేశ్ (Brahmotsavam) ప్రాచీన జానపద కళారూపమైన బరిడిని పుష్కల బృందం భ‌క్తుల‌ను (TTD) విశేషంగా ఆకట్టుకుంది.

Sri Malayappa Swamy mesmerised the devotees in His Mohini Avatar in Tirumala

రాజమండ్రికి (tirumala) చెందిన రాణి బృందం మయూర నృత్యంతో కనువిందు చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాశీ పుణ్యక్షేత్రంలో శివతత్వాన్ని తెలిపే అఘోర నృత్యాన్ని రాజమండ్రికి (TTD) చెందిన శ్రీనివాస్ బృందం శివలాస్యంతో నేత్రానందాన్ని కలిగించింది. రాజమండ్రికి (Brahmotsavam)చెందిన లక్ష్మీ ప్రసన్న బృందం తలం నృత్యంతో అలరించింది.

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరుకు (Brahmotsavam)చెందిన అనురాధా క్రాంత్ బృందం భరతనాట్యంతో ఆక‌ట్టుకుంది. కేరళ‌ రాష్ట్రానికి చెందిన మహదేవన్ బృందం (TTD) ప్రదర్శించిన గోపికా నృత్యం చ‌క్క‌గా సాగింది. జార్ఖండ్ (Brahmotsavam) రాష్ట్రానికి చెందిన నట్టువ అనే ఈ ప్రాచీన జానపద కళారూపాన్ని పద్మమాలిని బృందం తమ కళానైపుణ్యంతో ఆక‌ట్టుకున్నారు. తిరుపతికి (Brahmotsavam) చెందిన చందన బృందం తమ కోలాట నృత్యంతో అలరించింది. మొత్తం 11 కళాబృందాల్లో 248 మంది కళాకారులు శుక్రవారం శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+