TTD: సూర్యప్రభ వాహనంపై శ్రీరామచంద్రుడి వైభవం, కనులపండుగ స్వామివారు
తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశించారు.
ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సూర్యుడు తేజోనిధి. సకలరోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి.
అనంతరం ఉదయం 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిచారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.

కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి విపరీతమైన ఎండలను సైతం లెక్క చెయ్యకుండా భక్తులు ఏడుకొండల మీదకు వెలుతున్నారు. వేసవిలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు లక్షలాది మంది తరలి వెలుతుంటారు. తిరుమలలో భక్తల రద్దీ మోస్తారుగానే ఉంది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
తిరుమలలో బుధవారం 65, 570 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయంలో 24, 446 మంది భక్తులు కల్యాణకట్టలో శ్రీవారికి తలనీలాలు సమర్పించుకని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు స్వామివారి హుండీలో రూ 3. 53 కోట్ల రూపాయలు కానుకల రూపంలో సమర్పించుకున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి 13 కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎస్ఎస్ డీ టోకన్లు లేని భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోందని గురువారం టీటీడీ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications