శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాళ్లను ఎన్టీఆర్ - జగన్ అంటాం : వీళ్లను చంద్రబాబు అంటాం - సీఎం జగన్ పంచ్..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. తన భార్య కోసం యుద్దం చేస్తే శ్రీరాముడు అంటారు.. పరాయి స్రీ పై కన్నేస్తే రావణుడు అంటారని చెప్పారు. పరాయి వాడి ఆస్తిని కబ్తా చేస్తే కబ్జా దారుడు అంటారని చెప్పుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా తాను తాను పార్టీ పెట్టుకొని ఎవరైనా అధికారంలోకి వస్తే ఒక ఎంజీర్..ఒక ఎన్టీఆర్..ఒక జగన్ అంటారని వివరించారు. అదే పార్టీని.. సీఎం సీటును కబ్జా చేస్తే చంద్రబాబు అంటారంటూ ముఖ్యమంత్రి విశ్లేషించారు.

ప్రజలను మోసం చేసిన వారిని ఏమనాలి

శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జరిగిన వైఎస్సార్ జగన శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ భూ సర్వేలో భాగంగా ఏడు లక్షల 92 వేల 238 మంది భూ యజమానులకు భూ హక్కు పత్రాల పంపిణీ ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన తరువాత పాలనను ప్రజలకు దగ్గర చేసేందుకు వార్డు-గ్రామ సచివాలయాల మొదలు కొత్తగా మండలాలు..జిల్లాలు ఏర్పాటు చేసామని చెప్పారు. మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు నిర్ణయించామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు - దత్తపుత్రుడు అయిదేళ్లు కలిసి కాపురం చేసారని..వారికి ఇచ్చాపురం, పలాసలోని కిడ్నీ పేషెంట్లు గుర్తుకు రాలేదన్నారు. ఎన్నికలప్పుడు ప్రజలకు మాయ మాటలు చెప్పి..ఆ తరువాత ప్రజలను మోసం చేసి అలాంటి చంద్రబాబును సమర్ధిస్తున్న వీరిని ఏమనాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

అసెంబ్లీకి పంపాలా - బైబై చెప్పాలా

అసెంబ్లీకి పంపాలా - బైబై చెప్పాలా

రాక్షసమూకలు అనాలా అని నిలదీసారు. ఇటువంటి వ్యక్తులను చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని తాను నమ్ముకోలేదన్నారు. తాను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని సీఎం చెప్పారు. మీ ఇంటిలో మంచి జరిగిందా.. లేదా.. ఇదే కొలమానం పెట్టుకోండని, మంచి జరిగితే మీ బిడ్డకు అండంగా ఉండండి అని సీఎం జగన్‌ కోరారు. వెన్నుపోటు పొడిచిన నాయకుడిని అసెంబ్లీకి పంపాలా..మీ సేవలు వద్దు బాబూ అంటూ బైబై చెప్పి ఇంటికి పంపాలా అని ఆలోచన చేయాలని సూచించారు. ఇచ్చాపురం, పలాస గ్రామాల్లో రూ.765 కోట్లతో ఈ రోజు సర్ఫెస్‌ వాటర్‌ తీసుకువచ్చి కిడ్నీ సమస్యకు పూర్తి పరిష్కారం చూపించే గొప్ప మార్పుకు ఈ రోజు అడుగులు ముందుకు పడుతున్నాయన్నారు.

మంచి జరిగితేనే ఆశీర్వదించండి

ఆలోచన చేయమని అడుగుతున్నానని కోరారు. కిడ్నీ పేషేంట్లకు సంబంధించి దాదాపుగా రూ.50 కోట్ల పైచిలుకుతో కిడ్నీ రిసేర్చ్‌ ఆసుపత్రి అక్కడ కడుతున్నామని చెప్పారు. దాదాపుగా 90 శాతం పనులు పూర్తి అయ్యాయన్నారు. కిడ్నీ పేషెంట్ల కోసం మానవతా దృక్ఫథంలో ఆలోచన చేసి వారికి కూడా నెలకు రూ.10 వేలు డయాలసిస్‌ చికిత్స కోసం పింఛన్‌ ఇచ్చే గొప్ప మార్పుతీసుకువచ్చామని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలోని కొన్ని కోట్ల ఎకరాలకు సంబంధించిన సాగుభూములు, ఇతర భూములు చివరకు ఒక జానెడు కూడా తప్పు జరగకుండా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

తమ భూములు ఎవరైనా ఆక్రమించుకుంటారన్న భయం పూర్తిగా రైతుల నుంచి తొలగిపోతాయని,డూప్లికెట్‌ రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోతాయన్నారు. లంచాలకు పూర్తిగా అవకాశం లేకుండా పోతుందని ముఖ్యమంత్రి వివరించారు.

English summary
CM Jagan key remark in Naraannapet Public meeting on Chandra Babu and Pawan Kalayn
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X