బాబుకు ప్రశంసలు, ఆకట్టుకున్న ఎంపీ ప్రసంగం
హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు తన ప్రసంగంతో అన్ని పార్టీలను ఆకట్టుకున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య వ్యాఖ్యలతో 15 నిమిషాల పాటు వాయిదా పడ్డ లోక సభ తిరిగి ప్రారంభమైన వెంటనే రామ్మోహన్ నాయుడు ప్రసంగంతో సభ సైలెంటైంది.
ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రసంగాన్ని స్వపక్ష ఎంపీలతో పాటు విపక్ష సభ్యులు కూడా ఆసక్తిగా విన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుదుత్పత్తి, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న విద్యుత్తు, వ్యయం తదితరాలపై రామ్మోహన్ నాయుడు సరైన సమాచారంతో ప్రసంగించారు.

రామ్మోహన్ నాయుడు ప్రశ్నలకు స్పందించిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, సోలార్ విద్యుదుత్పత్తిపై ఏపీ సర్కారు తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు మెరుగైన చర్యలు తీసుకుంటూ, మిగిలిన రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలుస్తున్నారని అన్నారు.
దీంతో పాటు ఏపీ సర్కారు తీసుకుంటున్న చర్యలపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి చంద్రబాబుపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. రామ్మోహన్ నాయుడు చేసిన సూచనలను తప్పక పరిశీలిస్తామని ఆయన స్పీకర్ మీరాకుమారికి తెలిపారు.












Click it and Unblock the Notifications