శ్రీవారిని అడ్డం పెట్టుకొని పొలిటికల్ గేమ్స్..!!

తిరుమల లడ్డు వివాదంపై రాజకీయ రగడ కొనసాగుతుంది. ప్రభుత్వం ఈ వివాదంపై సిట్ ఏర్పాటు చేసింది. అటు మాజీ సీఎం జగన్ ఈ వివాదంపై ప్రధాని మోడీకి లేఖ రాశారు.. తిరుమలలో శాంతి యాగం నిర్వహించారు. ఈ సమయంలోనే వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా తిరుమల లడ్డు వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజకీయం కోసమే చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని.. శ్రీవారిని అడ్డం పెట్టుకొని పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నారని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి సీఎం స్థాయిలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు బాధ కలిగించాయి అన్నారు. దేవుడిని కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను చంద్రబాబు ఆందోళనకు గురి చేశారని ధ్వజమెత్తారు. ప్రతి 6 నెలలకోసారి టెండర్ల ప్రక్రియ ద్వారా నెయ్యి సేకరణ జరుగుతుందని వివరించారు.

Srikanth Reddy slamps Chandrababu over tirumala laddu controversy

జూలైలో వచ్చిన రిపోర్టును సెప్టెంబర్లో బయటపెట్టారని.. తిరుమల పై తప్పుడు ప్రచారం మంచిది కాదని గుర్తించాలని సూచించారు. తిరుమలలో నెయ్యి ట్యాంకర్లను మూడు దశల్లో పరీక్షిస్తారని వివరించారు. పరీక్ష చేసిన తర్వాత కూడా లడ్డు తయారీకి ఎలా పంపించారని ప్రశ్నించారు. అభిషేకానికి, నైవేద్యానికి, దీపాలకు పవిత్రమైన నెయ్యిని ఉపయోగిస్తారు అన్నారు. నవనీత సేవ కోసం కొండపైనే ఆవులను పెంచి వెన్నను తయారు చేస్తున్నారని చెప్పారు. జూన్ లో వచ్చిన నెయ్యిని వెనక్కు పంపించకుండా అదే నెయ్యితో లడ్డు ఎలా తయారు చేయించారని ప్రశ్నించారు.

చంద్రబాబు తప్పు చేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్ని రోజులు డ్రామా చేస్తారని నిలదీశారు. సెంటిమెంట్ క్రియేట్ చేసి తిరుమలను కలుషితం చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్, వరద నష్టం, మెడికల్ కాలేజీలు, వందరోజుల పాలన అంశాలను దృష్టి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం తిరుమల పైన చేస్తున్న ప్రచారానికి ముగింపు పలకాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+