శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్, దర్శనంలో కీలక మార్పులు..!!
శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. ఆలయ అధికారులు తాజా నిర్ణయాలు తీసుకున్నారు. విరామ (స్పర్శ) దర్శన విధానంలో కీలక మార్పులు చేశారు. క్షేత్రానికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా నేటి (ఆదివారం) నుంచి కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా నిబంధనలు.. దర్శనంలో మార్పుల గురించి ఆలయ పాలక వర్గం.. అధికారులు పూర్తి వివరాలను వెల్లడించారు.
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ అధికారులు విరామ (స్పర్శ) దర్శన విధానంలో కీలక మార్పులు చేస్తూ ఆలయ పాలక వర్గం నిర్ణయం తీసుకుంది. క్షేత్రానికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా నేటి (ఆదివారం) నుంచి కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దేవస్థానం ఛైర్మన్ రమేశ్ నాయుడు, కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీనివాసరావు దర్శన మార్పులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఇకపై శని, ఆదివారాలు, సోమవారాల్లో ఉదయం వేళ మనమిత్ర వాట్సాప్, ఆన్‌లైన్ ద్వారా ముందస్తుగా టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే విరామ (స్పర్శ) దర్శనానికి అనుమతి ఉంటుంది. ప్రముఖులు స్వయంగా ఆలయానికి విచ్చేసిన సందర్భాల్లో ప్రాధాన్యత ఆధారంగా ఉదయం స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించారు.

భక్తుల కోసం కీలక నిర్ణయాలు
కాగా, సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు ఉదయం వేళల్లో స్పర్శ దర్శనాన్ని పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు స్పష్టం చేశారు. వారికి అవకాశం ఉన్న మేరకు రాత్రి 9 గంటల సమయంలో మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అయితే.. సర్వదర్శనం, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సమయం కేటాయించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ మార్పుల వల్ల సాధారణ భక్తులకు దర్శన సౌకర్యం మరింత మెరుగుపడుతుందని ..ఈ విధాన పరమైన నిర్ణయాల అమలుకు భక్తులు సహకరించాలని ఈవో శ్రీనివాసరావు, ఛైర్మన్ రమేశ్ నాయుడు విజ్ఞప్తి చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేసారు.
.












Click it and Unblock the Notifications