పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!!
పదో తరగతి పరీక్షల్లో కొన్ని ప్రశ్నల్లో పొరపాట్లు దొర్లాయి. దీంతో, ఈ ప్రశ్నల పైన ప్రభుత్వానికి పేరెంట్స్ నుంచి వినతులు అందుతున్నాయి. తమ పిల్లలకు మార్కులు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదించారు. దీంతో, పొరపాట్లు దొర్లిన రెండు సబ్జెక్టుల్లో మార్కులు కలపాలని తాజాగా ఎస్సెస్సీ బోర్డు ప్రాధమికంగా నిర్ణయించారు. ఇంగ్లీషు.. హిందీ పరీక్షల్లో కలపాల్సిన మార్కుల పైన నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ మార్కులు కలిపే విధంగా పైన బోర్డు అధికారికం గా ఈ రోజు స్పష్టత ఇవ్వనుంది.
పదో తరగతి ఇంగ్లీషు ప్రశ్నా పత్రం కఠినంగా ఇవ్వటంతో పాటుగా కొన్ని ప్రశ్నలు బ్లూ ప్రింట్ కు విరుద్దంగా వచ్చాయని ఉపాధ్యాయులు.. విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో, మార్కు లు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళనతో ఉన్నారు. ఏపీలో ఏప్రిల్ 2న జరిగిన ఇంగ్లీషు పరీక్ష ప్రశ్నాపత్రంలో నాలుగు మార్కులకు ఇచ్చిన 28వ ప్రశ్న పాఠ్యపుస్తకం నుంచి వర్క్ బుక్ నుంచి ఇచ్చారు. అండర్ లైన్ చేసిన పదాలకు వ్యతిరేక పదాలు రాయాలని ప్రశ్న ఇచ్చారు. ఇది నాలుగు మార్కులు వచ్చింది. దీని పైన ఫిర్యాదులు రావటంతో ఇప్పటికే ప్రభుత్వ పరీక్షల విభాగం సబ్జెక్టు నిపుణుల కమిటీకి పంపించింది. దీని పైన నిర్ణయం తీసుకోనున్నారు. 27వ ప్రశ్నలో సమానార్ధాల ను గుర్తించటం బాక్స్ లో ఆరు పదాలు ఇవ్వాల్సి ఉండగా అయిదు ఇచ్చారు. బ్లూ ప్రింట్ ప్రకారం ఆరు పదాలు ఇవ్వాలి. పరీక్షల విభాగం మాత్రం ఇందులో ఎలాంటి తప్పు లేదని చెబుతోంది. అదే విధంగా హిందీ ప్రశ్నా పత్రంలో ఒక ప్రశ్నకు రెండు జవాబులు ఇచ్చినందున ఏది రాసినా ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది.

ప్రభుత్వానికి వినతులు.. నిపుణుల కమిటీ అధ్యయనం
ఈ సమయంలోనే పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు దొర్లిన ప్రశ్నలకు మార్కులు కలపాలని ఎస్‌ఎ్‌ససీ బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది. హిందీ పరీక్షలో రెండు సరైన సమాధానాలు వచ్చిన ఓ ప్రశ్నకు రెండు మార్కులు కలపాలని, ఇంగ్లిష్ పరీక్షలో రెండు సరైన సమాధానాలు వచ్చిన మరో 5 మార్కుల ప్రశ్నకు ఐదు మార్కులు కలపాలని నిర్ణయించింది. అయితే ఈ మార్కులు కలిపే విధానం ఎలా ఉంటుందనే విషయాన్ని నేడు బోర్డు అధికారికంగా ప్రకటించనుంది. అలాగే ఇంగ్లిష్ పరీక్షలో వర్క్ బుక్ నుంచి వచ్చిన 28వ ప్రశ్నకు కూడా మార్కులు కలపాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. దీంతో, దీని పై జిల్లా విద్యాధికారులకు త్వరలో సమాచారం పంపనున్నారు. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాకనం 6వ తేదీ ప్రారంభం కానుంది. దీంతో.. ఈ లోగా అభ్యంతరాల పై నిపుణుల కమిటీ చర్చిస్తోంది. వీరి నివేదిక ప్రకారం.. మూల్యాంకనం విషయంలో తీసుకోవాల్సి న మార్కుల నిర్ణయం పైన స్పష్టత ఇవ్వనున్నారు. కాగా.. తాజాగా మార్కులు కలపాలనే నిర్ణయం పైన అధికారికంగా ఎస్సెస్సీ బోర్డు ప్రకటన చేయనుంది.












Click it and Unblock the Notifications