టీడీపీ స్టాండప్..: పవన్ అంటే అంత భక్తి మరి
Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ మొదలయ్యాయి. ఈ ఉదయం సరిగ్గా 9:45 నిమిషాలకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరంభమైంది. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన 175 మందీ శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణం చేయిస్తోన్నారు.
శాసన సభలో తెలుగుదేశం పార్టీకి 134 మంది సభ్యుల బలం ఉంది. జనసేన- 21, భారతీయ జనతా పార్టీ-8 సభ్యులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. వారందరూ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్.. ఈ సభలో ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. వారిద్దరూ కూడా తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వారు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో నారా లోకేష్ శాసనమండలికి నామినేట్ అయ్యారు.
పార్టీ పెట్టిన 10 సంవత్సరాల తరువాత అసెంబ్లీలో అడుగు పెట్టారు పవన్. మొన్నటి ఎన్నికల్లో జనసేన ప్రభంజనం కనిపించింది. టీడీపీ- బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలో దిగారు. పోటీ చేసిన 21 స్థానాల్లో తిరుగులేని మెజారీటీతో తన అభ్యర్థులను గెలిపించుకోగలిగారు.

తాను స్వయానా 70 వేలకు పైగా మెజారిటీతో కాకినాడ జిల్లా పిఠాపురంలో నుంచి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగా గీతను ఓడించారు. అసెంబ్లీకి ఎన్నికైన తొలి దఫాలోనే చంద్రబాబు కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు.
తాజాగా శాసన సభ్యుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కల్యాణ్‌ను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఆహ్వానించగానే సభ హర్షధ్వానాలతో మారుమోగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభ్యులు చప్పట్లు కొడుతూ లేచి నిల్చున్నారు. ఆయనకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications