చంద్రబాబు మోత మోగిస్తోన్న తమ్ముళ్లు
TDP Janasena alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది. 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
ఇందులో 94 నియోజకవర్గాల్లో టీడీపీ, 24 చోట్ల జనసేన అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. చంద్రబాబు, కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు టీడీపీ జాబితాలో చోటు చేసుకున్నాయి. జనసేన తొలి జాబితాలో పవన్ కల్యాణ్ పేరు లేదు.

తమ పార్టీకి 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే కేటాయించడం పట్ల జనసేన క్యాడర్ భగ్గుమంటోంది. అనేక చోట్ల పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తోన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలనూ తగులబెడుతున్నారు. నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి చంద్రబాబు ఆడిన నాటకంగా విమర్శిస్తోన్నారు.
అదే సమయంలో టికెట్ దక్కని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబుపై భగ్గుమంటోన్నారు. అనంతపురం, కృష్ణా, ఎన్టీఆర్, విజయనగరం, కడప.. ఇలా ఫలానా జిల్లా అనే తేడాలేవీ ఉండట్లేదు. చంద్రబాబు, నారా లోకేష్‌పై సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే మండిపడుతున్నారు.
అన్నమయ్య రాయచోటి జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జ్ జీ శంకర్ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. పెట్రోల్ క్యాన్లతో చంద్రబాబు ఇంటిని ముట్టడించారు. అక్కడే బైఠాయించారు. నిరసన ప్రదర్శనలను చేపట్టారు.

చంద్రబాబు ఇటీవలే విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో జీ శంకర్‌కు టికెట్ దక్కలేదు. తంబళ్లపల్లె టికెట్‌ను జయచంద్రారెడ్డికి కేటాయించారు. 2014 నాటి ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి శంకర్ ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
అయినప్పటికీ- చంద్రబాబు మీద నమ్మకంతో నియోజకవర్గంటో టీడీపీని బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడ్డారు. సొంత ఖర్చులతో పార్టీని నిలబెట్టారు. ఆయననే ఇన్‌ఛార్జీగా నియమించారు చంద్రబాబు. చివరికి శంకర్‌ను కాకుండా జయచంద్రారెడ్డికి టికెట్ లభించడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications