Ys Jagan: జగన్ కేసుల విచారణ ఆలస్యంపై సుప్రీం అసహనం..కీలక వ్యాఖ్యలు..
ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ కింది కోర్డుల్లో నత్తనడకన సాగుతుండటం, వందల సంఖ్యలో వాయిదాలు పడుతున్న నేపథ్యంలో దీన్ని ఇతర రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ చేయాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు.. దర్యాప్తు సంస్ధ అయిన సీబీఐకి పలు ప్రశ్నలు వేసింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు సంసిద్ధత వ్యక్తం చేసింది.
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు ఇవాళ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకు గల కారణాలపై సీబీఐని ఆరా తీసింది. అయితే సీబీఐ మాత్రం తమకేం సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో దిగువ కోర్టుల్లో ఈ కేసుల విచారణ ఆలస్యమైతే సీబీఐకి సంబంధ లేదా అని ప్రశ్నించింది. అయితే తెలంగాణ హైకోర్టు ఇప్పటికే సుమోటోగా ఈ వ్యవహారంపై విచారణకు సిద్ధమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏప్రిల్ కు విచారణ వాయిదా వేసింది.

అయితే ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అటు సీబీఐకి, ఇటు జగన్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డికి కీలక ప్రశ్నలు వేశారు. జగన్ కేసుల ఆలస్యంపై దర్యాప్తు సంస్ధగా సీబీఐకి సంబంధం లేదని ఎలా చెప్తారని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు.
అలాగే రఘురామరాజు దాఖలు చేసిన ఈ పిటిషన్ పై విచారణ ముగించాలని, తెలంగాణ హైకోర్టు విచారణ పూర్తయ్యే వరకూ 3 నెలల గడువు ఇవ్వాలని జగన్ లాయర్ నిరంజన్ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ..సమయం ఇచ్చినా ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. చివరిగా తెలంగాణ హైకోర్టు ఇచ్చే ఆదేశాల ఆధారంగా స్పందిస్తామన్నారు.












Click it and Unblock the Notifications