ఏపీ హైకోర్టుకు కీలక సూచనలు చేసిన సుప్రీంకోర్టు

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 1పై దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కందుకూరు, గుంటూరుల్లో రోడ్ షో, బహిరంగ సభల్లో తొక్కిసలాట నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ జీఓను జారీ చేసింది.

రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధించింది. ర్యాలీలను చేపట్టడంపైనా ఉక్కుపాదం మోపింది. జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్డు-రవాణా మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న రోడ్లపై బహిరంగ సభలు గానీ, ర్యాలీలను గానీ నిర్వహించడాన్ని నిషేధించింది ఏపీ హోం మంత్రిత్వ శాఖ. మున్సిపాలిటీల ఆధీనంలో ఉన్న రోడ్లను కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చింది.

Supreme Court given direction to AP High Court

పంచాయతీ రాజ్‌ రహదారులపైన ఈ ఉత్తర్వులు అమలవుతాయని స్పష్టం చేసింది. ఇరుకు రోడ్లు, సందుల్లో సభలను నిర్వహించడానికి, ర్యాలీలను చేపట్టడానికి అనుమతి లేదని వివరించింది. ప్రత్యేక సందర్భాల్లో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్‌ కమిషనర్ల అనుమతి తీసుకుని అలాంటి ప్రదేశాల్లో బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహించే వెసలుబాటును కల్పించింది ప్రభుత్వం.

అలాంటి సమయంలో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఇచ్చే గైడ్ లైన్స్ ను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుందని పేర్కొంది. బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహించే సమయంలో పోలీసులు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వాహకులు సమయ పాలనను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. దీనిపైలిఖితపూరక హామీని పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. సభను ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందనేది స్పష్టం చేయాలి.

ఈ జీఓను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలు తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మాజీమంత్రి కొల్లు రవీంద్ర, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. 1861 పోలీస్ యాక్ట్‌లోని 30వ సెక్షన్‌కు విరుద్ధంగా ఉందని వాదించారు. వాదనలను విన్న తరువాత హైకోర్టు ఈ జీఓను సస్పెండ్ చేసింది. జనవరి 24వ తేదీ వరకు సస్పెండ్ చేసినప్పటికీ- అది ఇంకా కొనసాగుతోంది.

దీనితో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సస్పెన్షన్‌ను ఎత్తేయాలని అభ్యర్థించింది. ఈ పిటీషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని ధర్మాసనం ఇవ్వాళ విచారణ చేపట్టింది. వాదోపవాదాలను ఆలకించింది. ఈ జీవో నెంబర్ 1పై త్వరగా విచారణ ముగించాలంటూ ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు సుప్రీంకోర్టు సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+